త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | బాలాపూర్ గ‌ణేశ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేక పూజ‌లు

Vijay Devarakonda | బాలాపూర్ గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకునేందుకు సామాన్య భ‌క్తుల‌తో పాటు సెల‌బ్రెటీలు కూడా త‌ర‌లివ‌స్తున్నారు. టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా బాలాపూర్ గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

S

Movies | Published On Sep 20, 2026, 10.10 am IST

Vijay Devarakonda | బాలాపూర్ గ‌ణేశ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేక పూజ‌లు
Advertisement

Vijay Devarakonda | త్రినేత్ర‌.న్యూస్ : బాలాపూర్ గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకునేందుకు సామాన్య భ‌క్తుల‌తో పాటు సెల‌బ్రెటీలు కూడా త‌ర‌లివ‌స్తున్నారు. నిన్న రాత్రి మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, స‌బితా ఇంద్రారెడ్డి ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆ త‌ర్వాత టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా బాలాపూర్ గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం విజ‌య్‌కి ల‌డ్డూ ప్ర‌సాదం అంద‌జేసి, ఆశీర్వ‌దించారు అర్చ‌కులు.

శాలువాతో స‌త్కారం

ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం విజయ్ దేవరకొండను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు.

జ‌న‌సంద్రంగా మారిన బాలాపూర్

గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకునేందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చార‌న్న విష‌యం తెలుసుకుని.. అక్క‌డికి భారీ సంఖ్య‌లో అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. విజ‌య్ అన్న అంటూ కేరింత‌లు పెట్టారు. ఫొటోలు, సెల్ఫీల కోసం అభిమానులు ఎగ‌బ‌డ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి విజ‌య్ కూడా అభివాదం చే్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

Advertisement
Advertisement