అఖండ 2 రిలీజ్ వాయిదా – మహేష్‌బాబు సినిమాల అప్పులే కారణమా?
అఖండ 2
బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ ముంగిట చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కావాల్సింది. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్లతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చాయి. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో అనూహ్యంగా టెక్నికల్ ఈష్యూస్ వల్ల బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల సినిమానే పోస్ట్‌పోన్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. నిర్మాతల ప్రకటనతో బాలకృష్ణ అభిమానులు డిసపాయింట్ అవుతున్నారు. నిర్మాతలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అఖండ 2ను అనుకున్న షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నాం. ఇది మాకు ఎంతో బాధను కలిగిస్తోంది. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమానికి, సినీ లవర్‌కు ఇది ఎంతో నిరాశను కలిగిస్తుందని అర్థం చేసుకుంటున్నాం. మా నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఖండ 2 పోస్ట్‌పోన్‌కు కారణాలేమిటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఫైనాన్షియల్ ఈష్యూస్ వల్లే వాయిదాపడినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌కు చెల్లించాల్సిన పాత అప్పుల వల్లే అఖండ 2 వాయిదా పడినట్లు సమాచారం. ఈ బకాయిల విషయంలో 14 రీల్స్ ప్లస్‌పై బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. తమకు ఇవ్వాల్సిన 28 కోట్లు చెల్లించేవరకు అఖండ 2 రిలీజ్‌ను ఆపాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ గురువారం విచారణ జరిపిన కోర్టు...ఈరోస్ ఇంటర్నేషనల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో అఖండ 2 రిలీజ్ వాయిదాపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ అప్పులు ఇప్పటివీ కాదట. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి 14 రీల్స్ సంస్థ వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాల్లో మహేష్‌బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాలకు ఈరోస్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ చేసిందట. బాక్సాఫీస్ వద్ద వన్ నేనొక్కడినేతో పాటు ఆగడు డిజాస్టర్‌గా నిలవడంతో 14 రీల్స్ భారీగా నష్టపోయింది. ఈరోస్‌కు నిర్మాతలు 28 కోట్ల వరకు బాకీలు పడింది. ఈ అప్పుల గొడవ కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది.చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
14 రీల్స్‌పై రివేంజ్ కోసం ఎదురుచూసిన ఈరోస్ ఇంటర్నేషనల్ అఖండ 2 రిలీజ్‌ను వాయిదా వేసి గట్టి షాకిచ్చారు. రిలీజ్ అడ్డంకులు శుక్రవారం సాయంత్రం లోగా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈవినింగ్ షోస్ నుంచి అఖండ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



