Kannada TV Actess | బాత్‌రూమ్‌లో ఆ నటిని సీక్రెట్‌గా వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేసి..
ఈ ఘటనపై ఆ నటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోను ఒక ఇన్‌స్టా అకౌంట్ నుంచి షేర్ చేశారని, అది కూడా నటి ఇన్‌స్టా అకౌంట్ అనుకొని నటి ఫ్రెండ్ ఇన్‌స్టాకి ఆ వీడియోను షేర్ చేశారని పోలీసులు తెలిపారు.
Kannada TV Actess | కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ టీవీ సీరియల్ నటికి చేదు అనుభవం ఎదురైంది. 32 ఏళ్ల ఆ నటి బాత్‌రూమ్‌లో ఉండగా ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో రికార్డు చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అడ్డం పెట్టుకొని తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన బెంగళూరులోని ఇండోర్ స్టేడియంలో చోట చేసుకుంది. ఆ స్టేడియంలో ఓ ప్రోగ్రామ్‌కి ఆ నటి అటెండ్ అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాత్‌రూమ్‌ని తను వాడుకుంది. ఆ సమయంలోనే అక్కడే ఉన్నవాళ్లలో ఎవరో తనను సీక్రెట్‌గా వీడియో తీశారు. ఫిబ్రవరి 7న ఈ ఘటన చోటు చేసుకోగా, రికార్డు చేసిన వీడియోను ఆ వ్యక్తి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఈ ఘటనపై ఆ నటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోను ఒక ఇన్‌స్టా అకౌంట్ నుంచి షేర్ చేశారని, అది కూడా నటి ఇన్‌స్టా అకౌంట్ అనుకొని నటి ఫ్రెండ్ ఇన్‌స్టాకి ఆ వీడియోను షేర్ చేశారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు.. నటిని బెదిరించడం స్టార్ట్ చేశాడని.. తన దగ్గర ఇంకా ఆ నటి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. తను అడిగినంత డబ్బులు ఇస్తేనే ఆ వీడియోలు డిలీట్ చేస్తా అని బెదిరించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఒకవేళ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోను షేర్ చేస్తా అని నిందితుడు నటిని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నిందితుడు వీడియోను షేర్ చేసిన ఇన్‌స్టా అకౌంట్ ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో సైబర్ పోలీసులు పడ్డారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






