JD Chakravarthy | కమల్ హాసన్‌కు దక్కని అదృష్టం నాకు దక్కింది.. ‘గాయపడ్డ సింహం’లో నా క్యారెక్టర్ హైలెట్: జేడీ చక్రవర్తి
రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో రాబోతున్న 'గాయపడ్డ సింహం' చిత్రంలో తాను పోషించిన 'ధర్మా' క్యారెక్టర్ యాక్టర్‌గా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. కమల్ హాసన్‌కు కూడా దక్కని అదృష్టం ఈ క్యారెక్టర్ ద్వారా తనకు దక్కిందన్నారు.
సంక్షిప్త సారాంశం
తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్ 'గాయపడ్డ సింహం'. మే 1న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో తన పాత్ర 'బ్రూటల్ ధర్మ' విభిన్న షేడ్స్ తో ఆకట్టుకుంటుందని, ఒకే లుక్‌లో ఉంటూ రెండు వేరియేషన్స్ చూపించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపారు. ఓటీటీల వల్ల కంటెంట్ క్వాలిటీ పెరిగిందని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
JD Chakravarthy | త్రినేత్ర.న్యూస్ : డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'గాయపడ్డ సింహం'. పవన్ సాదినేని సమర్పణలో, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మే 1వ తేదీన 'గాయపడ్డ సింహం' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
'గాయపడ్డ సింహం'లో ధర్మా పాత్ర చేయడం వెనుక ఆసక్తి
"క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా చాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ రెండు హాఫ్స్‌లో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది."
'బ్రూటల్ ధర్మ'.. కానీ భలే నవ్విస్తాడు
"ఈ కథను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇందులో నా పాత్ర పేరు ‘బ్రూటల్ ధర్మ’. పేరుకు బ్రూటల్ అని ఉన్నా, నేను స్క్రీన్‌పై చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. తరుణ్ భాస్కర్ చేసిన దరహాస్ క్యారెక్టర్, నా క్యారెక్టర్, అలాగే ఇంకో పాత్ర— ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చాలా హిలేరియస్‌గా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ కథ చెబుతున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను."
'సింహం' ఎవరిని గాయపరిచింది?
"టైటిల్‌కు తగ్గట్టే ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ మూడో సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం. నా కెరీర్‌లో ఎప్పుడూ గబగబా సినిమాలు చేయలేదు. కథ నచ్చితేనే చేస్తాను. కథ వర్క్ అవుట్ అయితేనే సినిమా ఆడుతుంది. 'శివ' చిత్రంలో నా క్యారెక్టర్ నా పేరుగా మారిపోయింది. భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ లాంటి పాత్రలు అందుకే గుర్తుండిపోయాయి."
ఓటీటీ వర్సెస్ థియేటర్స్ పై జేడీ కామెంట్స్
"ఓటీటీ రాకతో ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో ఆడాలంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉండాలి. ఆడియన్స్‌కు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు. కానీ నచ్చితే మాత్రం ఓటీటీ వరకూ ఆగరు… వెంటనే థియేటర్‌కి వెళ్లి చూస్తారు. అదే మనిషి నైజం." అని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌కి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన అనుభవం ఉందని, ఆయన ఈ సినిమాను చాలా రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో తీశారని జేడీ కొనియాడారు. భవిష్యత్తులో కూడా యాక్టింగ్ పైనే దృష్టి పెడతానని, హీరో లేదా విలన్ అని బేరీజు వేసుకోకుండా ప్రయోగాత్మక పాత్రలు ఖచ్చితంగా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



