Harish Rao Challenges CM Revanth Reddy | రేవంత్.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్, ఎన్నికల్లో తేల్చుకుందాం: హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్! దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని, ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
- సీఎం హోదాలో ఉండి భౌతిక రూపంపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
- నీ పాలనపై అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు (Early elections) రావాలని ఓపెన్ చాలెంజ్
- ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని, ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్‌పై విమర్శలని మండిపాటు
- సింగరేణి టెండర్లు, ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్, రైతుబంధు విషయంలో రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శ
Harish Rao Challenges CM Revanth Reddy | తెలంగాణ రాజకీయాలు (Telangana politics) మరోసారి వేడెక్కాయి. నల్లగొండ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పరిపాలనను గాలికి వదిలేసి, తన ఎత్తు గురించి, భౌతిక రూపం గురించి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ముందస్తుకు సై.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం
మా ఎమ్మెల్యేలను లాక్కొని ప్రగల్భాలు పలకడం కాదని, దమ్ముంటే వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి రావాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. "2034 దాకా కుర్చీ నాదే అని పగటికలలు కనడం కాదు.. నీ పాలనపై అంత నమ్మకం ఉంటే ఇప్పుడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎలక్షన్ కి రా.. జనం ఎవరిని ఉప్పుపాతర వేస్తారో చూసుకుందాం" అని ఘాటుగా స్పందించారు.
కుర్చీ కదులుతోందన్న భయం పట్టుకుంది
పాలకుడిగా ఉన్నవాడు ప్రతిపక్షాలను తిడుతూ కాలం వెళ్లబుచ్చడం కరెక్ట్ కాదని హరీశ్ హితవు పలికారు. మహిళలకు రూ.2500, స్కూటీ, తులం బంగారం, రూ.4000 పెన్షన్, 2 లక్షల ఉద్యోగాలు.. వంటి ఆరు గ్యారెంటీల (Six Guarantees) గురించి మాట్లాడటం చేతకాకనే బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. "నీకు కుర్చీ కదులుతోందన్న భయం పట్టుకుంది. అందుకే నిద్రలోనూ కేసీఆర్, కేటీఆర్, నన్నే కలవరిస్తూ రోజూ బీఆర్ఎస్ నామస్మరణ చేస్తున్నావు" అని ఎద్దేవా చేశారు.

ఎత్తు కాదు.. బుద్ధి పొట్టిది
రేవంత్ రెడ్డి తన ఆరడుగుల ఎత్తు గురించి మాట్లాడుతున్నారని, తాను లేదా జగదీశ్ రెడ్డి పొట్టిగా ఉంటే ఏంటని హరీశ్ ప్రశ్నించారు. "ప్రజలకు సేవ చేయడంలో, అభివృద్ధి చేయడంలో మేమెప్పుడూ పొడుగుగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి నీ మనసు, ఆలోచన, నీ బుద్ధి పొట్టిది కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సింగరేణి టెండర్లు, SLBC పై పచ్చి అబద్ధాలు
సింగరేణి (Singareni) టెండర్ల గురించి రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని హరీశ్ ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చి, తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్‌స్ట్రక్షన్‌కు టెండర్ కట్టబెట్టింది నిజం కాదా? అని నిలదీశారు. అలాగే, ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో బీఆర్ఎస్ 12 కిలోమీటర్లు తవ్వితే.. కాంగ్రెస్ 12 మీటర్లు తవ్వలేక 8 మంది అమాయక కార్మికులను బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టింది నువ్వే కదా?
తెలంగాణ ఉద్యమం గురించి, త్యాగాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుందని హరీశ్ రావు విమర్శించారు. "ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టి, సోనియాను 'బలిదేవత' అన్న నువ్వా.. లాఠీదెబ్బలు తిని 300 కేసులు ఎదుర్కొన్న మా త్యాగాల గురించి మాట్లాడేది?" అని నిలదీశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా తెలంగాణ హక్కుల కోసం అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
ఆగస్టు 20, 2026

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
ఆగస్టు 19, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



