Monsoon Diseases | వర్షాకాలంలో తరచూ వచ్చే 8 రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు ఇవే.. వీటితో జాగ్రత్త..
Monsoon Diseases | రోజువారీ ప్రయాణం, రద్దీగా ఉండే లిఫ్టులు, అందరూ కలిసి ఉపయోగించే వర్క్‌స్టేషన్లు, ఎయిర్ కండిషన్డ్ మీటింగ్ రూమ్‌లు, ఆఫీస్ ప్యాంట్రీలు వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లకు హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉంటుంది. దీనికి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, తడి దుస్తులు, తగినంత గాలి ప్రసరణ లేకపోవడం, సహోద్యోగులతో తరచూ దగ్గరగా ఉండడం కూడా తోడవుతాయి.
Monsoon Diseases | రోజువారీ ప్రయాణం, రద్దీగా ఉండే లిఫ్టులు, అందరూ కలిసి ఉపయోగించే వర్క్‌స్టేషన్లు, ఎయిర్ కండిషన్డ్ మీటింగ్ రూమ్‌లు, ఆఫీస్ ప్యాంట్రీలు వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లకు హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉంటుంది. దీనికి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, తడి దుస్తులు, తగినంత గాలి ప్రసరణ లేకపోవడం, సహోద్యోగులతో తరచూ దగ్గరగా ఉండడం కూడా తోడవుతాయి. దీంతో వర్షాకాలం వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌లు వ్యాప్తి చెందడానికి అనుకూలంగా మారుతుంది. భారత్‌లో ఇప్పటికే కాలానుగుణ అంటువ్యాధుల భారం గణనీయంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా నమోదైన సమాచారం ప్రకారం 2021 నుంచి 2025 మధ్య భారత్‌లో తీవ్రమైన విరేచనాల వ్యాధి, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, ఇ, కలరా, లెప్టోస్పిరోసిస్ వంటి ప్రధాన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు సంబంధించిన కేసులు 1.7 కోట్లకు పైగా నమోదయ్యాయి.
ఇన్‌ఫ్లుయెంజా..
వర్షాకాల వ్యాధులు అంటే దోమ కాట్లు లేదా కలుషిత నీటి వల్ల వచ్చే అనారోగ్యాలే అని చాలామంది భావిస్తారు. అయితే కార్యాలయాలు కూడా శ్వాసకోశ వైరస్‌లు, జీర్ణాశయ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు, కంటి ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాపించే ప్రదేశాలుగా మారుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గరగా ఉండడం, ఉమ్మడి వస్తువులు, పంచుకునే ప్రదేశాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా లేదా కాలానుగుణ ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల వల్ల వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం ఇది శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్. ఆఫీసుల్లో దగ్గడం, తుమ్మడం, సరిగా గాలి ప్రసరణ లేని మీటింగ్ రూమ్‌లు, ఉమ్మడి డెస్కులు, లిఫ్టులు, దగ్గరగా మాట్లాడడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, జ్వరం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండడం, కార్యాలయంలో గాలి ప్రసరణ మెరుగుపరచడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వయసు ఎక్కువగా ఉన్నవారు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు ప్రతి ఏడాది ఇన్‌ఫ్లుయెంజా టీకా తీసుకోవడాన్ని పరిగణించవచ్చు.

సార్స్-కోవ్-2, కంజంక్టివైటిస్..
కోవిడ్-19 ఇక ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కాకపోయినా, సార్స్-కోవ్-2 వైరస్ ఇప్పటికీ వ్యాప్తిలోనే ఉంది. కొన్ని కాలాల్లో శ్వాసకోశ వైరస్‌లతోపాటు కేసులు పెరిగే అవకాశం ఉంది. అమెరికా సీడీసీ శ్వాసకోశ వైరస్‌ల సమాచారం ప్రకారం జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాసన లేదా రుచి కోల్పోవడం కూడా సంభవిస్తాయి, అయితే గతంతో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తోంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆఫీస్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం, గాలి ప్రసరణను మెరుగుపరచడం, లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం, టీకాలు తాజాగా ఉండేలా చూసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చు. ఇక ఇన్‌ఫెక్టెడ్ సహోద్యోగి ఉమ్మడి వస్తువులు లేదా ఉపరితలాలను తాకిన తర్వాత మరొకరు వాటిని తాకి తమ కళ్లను తాకితే కంజంక్టివైటిస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కంజంక్టివైటిస్‌పై సీడీసీ సమాచారం ప్రకారం కళ్లు ఎర్రబడడం, నీరు కారడం, మంట లేదా అసౌకర్యం, కనురెప్పలు వాపు, కంటి నుంచి స్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లను తరచూ తాకకుండా ఉండడం, చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవడం, తువాళ్లు లేదా సౌందర్య సాధనాలు ఇతరులతో పంచుకోకపోవడం, తరచూ తాకే ఉపరితలాలను శుభ్రం చేయడం ద్వారా వ్యాప్తిని తగ్గించవచ్చు.
నోరో వైరస్, జలుబు..
ఆఫీస్ ప్యాంట్రీలు, అందరూ కలిసి భోజనం చేసే ప్రదేశాలు, సరైన ఆహార పరిశుభ్రత పాటించని సందర్భాల్లో నోరోవైరస్ వంటి వైరస్‌లతోపాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. నోరోవైరస్‌పై సీడీసీ సమాచారం ప్రకారం విరేచనాలు, వాంతులు, కడుపులో మెలికలు, జ్వరం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి. ఉమ్మడిగా ఉపయోగించే కిచెన్ ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇక ఈ సీజన్‌లో చాలా మందిని జలుబు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇన్‌ఫ్లుయెంజాతో పోలిస్తే సాధారణ జలుబు తీవ్రత తక్కువగా ఉంటుంది. అయితే ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. తుమ్ములు, ముక్కు కారడం, స్వల్ప దగ్గు, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతుల పరిశుభ్రత పాటించడం, ముఖాన్ని పదేపదే తాకకుండా ఉండడం, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, కీబోర్డులు, ఫోన్లు, డెస్క్ వంటి ఉపరితలాలను శుభ్రంగా ఉంచడం ద్వారా జలుబు వ్యాప్తిని తగ్గించవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు..
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు భిన్నంగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కార్యాలయ గాలి ద్వారా వ్యాప్తి చెందవు. అయితే తడి దుస్తులు, చెమటతో తడిసిన షూలు, అధిక తేమ వంటి వాతావరణ పరిస్థితులు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. చర్మంపై దురద, వలయం ఆకారంలో దద్దుర్లు, ఎర్రబడడం, చర్మం పొలుసులుగా ఊడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాదాలను పొడిగా ఉంచడం, తడిసిన సాక్స్‌ను వెంటనే మార్చడం, గాలి ప్రసరణ ఉండే పాదరక్షలు ధరించడం, తువాళ్లు లేదా జిమ్ పరికరాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ సాధారణంగా పిల్లలకు వచ్చే వ్యాధిగా భావిస్తారు. అయితే పెద్దలకు కూడా ఇది సోకదు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ ఉన్న పిల్లలతో సన్నిహితంగా ఉండే తల్లిదండ్రులకు ప్రమాదం ఉంటుంది. జ్వరం, నోటిలో పుండ్లు, చేతులు, పాదాలపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవడం, ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం, ఉమ్మడి ఉపరితలాలను శుభ్రం చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.
లెప్టోస్పిరోసిస్..
లెప్టోస్పిరోసిస్ సహోద్యోగుల నుంచి నేరుగా వ్యాపించదు. అయితే వర్షాకాలంలో ప్రయాణించే సమయంలో వరదనీరు, నీటిముంపు ప్రాంతాలకు గురికావడం వల్ల దీని ప్రమాదం పెరుగుతుంది. ఇన్‌ఫెక్టెడ్ ఎలుకల మూత్రంతో కలుషితమైన వరదనీటిలో నడవడం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. లెప్టోస్పిరోసిస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం భారీ వర్షాలు, నీటిముంపు తర్వాత ఈ వ్యాధి ప్రమాదం పెరుగుతుందని సూచిస్తోంది. అధిక జ్వరం, ముఖ్యంగా కాలి కండరాల్లో తీవ్రమైన నొప్పి, తలనొప్పి, కళ్ల ఎర్రబడడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో కామెర్లు వస్తాయి. సాధ్యమైనంత వరకు వరదనీటిలో నడవకుండా ఉండాలి. వాటర్‌ప్రూఫ్ పాదరక్షలు ధరించాలి. శరీరంపై ఉన్న గాయాలను వెంటనే శుభ్రం చేయాలి. వరదనీటిలోకి వెళ్లిన తర్వాత జ్వరం వస్తే వైద్యులను సంప్రదించాలి. భారత్‌లో ముఖ్యంగా వరదలు, నీటిముంపు తర్వాత లెప్టోస్పిరోసిస్ ముఖ్యమైన వర్షాకాల ఆరోగ్య సమస్యగా కొనసాగుతోంది.

ఇన్‌ఫెక్షన్లకు కారణాలు ఇవే..
డెస్క్ వద్దే భోజనం చేయడం, వాటర్ బాటిళ్లు లేదా కట్లరీని ఇతరులతో పంచుకోవడం, ఉమ్మడి పరికరాలను ఉపయోగించిన తర్వాత ముఖాన్ని తాకడం, మీటింగ్ రూమ్‌లలో సరైన గాలి ప్రసరణ లేకపోవడం, జ్వరం లేదా విరేచనాలు ఉన్నప్పటికీ ఆఫీస్‌కు రావడం, ఫోన్లు, కీబోర్డులు, మౌస్ వంటి వస్తువులను శుభ్రం చేయకపోవడం వంటి రోజువారీ అలవాట్లు ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతాయి. అయితే జాగ్రత్తలను పాటిస్తే ఈ వ్యాధులకు చాలా వరకు ముందుగానే నివారించవచ్చు. సబ్బుతో చేతులను తరచూ కడుక్కోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ను ఉపయోగించాలి. వర్క్‌స్టేషన్‌ను శుభ్రంగా ఉంచాలి. తగినంత నీరు తాగుతూ, తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. ప్రయాణంలో తడిసిన షూలు, సాక్స్‌ను వీలైనంత త్వరగా పొడిగా మార్చుకోవాలి. సాధ్యమైన చోట కిటికీలు తెరిచి గాలి ప్రసరణ పెంచాలి. జ్వరం లేదా ఇతరులకు సులభంగా వ్యాపించే లక్షణాలు కనిపిస్తే ఆఫీస్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
అయితే వర్షం పడడం వల్లే వ్యాధులు వస్తాయని కాదు. రద్దీగా ఉండే ఇండోర్ ప్రదేశాలు, తగినంత గాలి ప్రసరణ లేకపోవడం, తేమ, ఉమ్మడి ఉపరితలాలు వర్షాకాలంలో సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందడానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. ఇన్‌ఫ్లుయెంజా, కంజంక్టివైటిస్, వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు కార్యాలయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, లెప్టోస్పిరోసిస్ మాత్రం ప్రధానంగా తేమతో కూడిన పరిస్థితులు, వర్షాకాల ప్రయాణంతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే వీటిలో చాలా వ్యాధులను ముందస్తు జాగ్రత్తలతో నివారించవచ్చు. చేతుల పరిశుభ్రత పాటించడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండడం, గాలి ప్రసరణను మెరుగుపరచడం, లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు కార్యాలయంలోని ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
సంబంధిత వార్తలు

H1N1 | కొన్ని నగరాల్లో భారీగా హెచ్1ఎన్1 కేసులు, కొన్ని చోట్ల స్వల్పంగా.. ఎందుకీ తేడా..?
సెప్టెంబర్ 1, 2026

Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళన అక్కర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్
ఆగస్టు 27, 2026

Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
జులై 17, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ
- ●Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
- ●Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!
- ●Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!

Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ

Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?



