త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భారత మార్కెట్‌లోకి సరికొత్త షుగర్ మెడిసిన్.. వారానికి ఒక్కసారే వేసుకోవాలి

సాధారణంగా షుగర్ పేషెంట్లకు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో బయటి నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్‌ను పంపిస్తారు. దాన్నే సింథటిక్ ఇన్సులిన్ అంటారు. దాని వల్ల రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ కొత్త ఒజెంపిక్ మెడిసిన్ మాత్రం శరీరంలోనే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా బాడీని తయారు చేస్తుంది

J

Health | Published On Dec 12, 2025, 6.26 pm IST

భారత మార్కెట్‌లోకి సరికొత్త షుగర్ మెడిసిన్.. వారానికి ఒక్కసారే వేసుకోవాలి
Advertisement

ఈరోజుల్లో షుగర్ లేనివాళ్ల చాలా తక్కువ. 10 మందిలో ఐదారుగురికి షుగర్ ఉంది. తరాలు మారుతున్న కొద్దీ మన జీవన శైలి కూడా మారుతోంది. అందులో భాగంగానే కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. మన తాతల కాలంలో షుగర్ అంటేనే తెలియదు. కానీ ఇప్పుడు షుగర్ చాప కింద నీరులా డేంజరస్‌గా విస్తరిస్తోంది. షుగర్ వ్యాధినే మెడికల్ పరిభాషలో డయాబెటిస్ అంటాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2. పుట్టుకతో వచ్చే టైప్ 1 డయాబెటిస్‌ను జీవితాంతం కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిందే. కానీ, టైప్ 2 డయాబెటిస్ వస్తే మాత్రం మన జీవనశైలిని మార్చుకొని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ, కొందరు డాక్టర్లు మాత్రం డయాబెటిస్ నియంత్రణ కోసం జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సిందే అని చెబుతుంటారు. కొందరు డయాబెటిక్ పేషెంట్లు దశాబ్దాలుగా షుగర్ ట్యాబ్లెట్లను వాడుతూనే ఉన్నారు. ఇప్పటికే మార్కెట్‌లో డయాబెటిస్‌కు సంబంధించి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా డెన్మార్క్‌కి చెందిన ఫార్మా కంపెనీ నొవో నొర్డిస్క్ టైప్ 2 డయాబెటిస్ మెడిసిన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.

ఒక డోస్‌కి రూ.2,200

ఈ మెడిసిన్ పేరు ఒజెంపిక్. దీన్నే సీమాగ్లుటైడ్ ఇంజెక్షన్ అని పిలుస్తారు. ఈ ఇంజెక్షన్ ప్రారంభ ధర రూ.2,200 గా ఉంటుంది. అది 0.25 మిల్లీగ్రామ్ డోసుకి. ఈ మెడిసిన్ 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉంటుంది. తొలి 4 వారాలు మాత్రం 0.25 ఎంజీ డోసు మెడిసిన్ వేసుకోవాలి. ఆ తర్వాత మరో 4 వారాలు 0.50 ఎంజీ డోసు వాడాలి. ఇలా ప్రతి 4 వారాల తర్వాత 0.25 ఎంజీ పెంచుకుంటూ వెళ్లాలి.

మిగితా మెడిసిన్‌కి, ఒజెంపిక్‌కి ఏంటి తేడా?

సాధారణంగా షుగర్ పేషెంట్లకు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో బయటి నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్‌ను పంపిస్తారు. దాన్నే సింథటిక్ ఇన్సులిన్ అంటారు. దాని వల్ల రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ కొత్త ఒజెంపిక్ మెడిసిన్ మాత్రం శరీరంలోనే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా బాడీని తయారు చేస్తుంది. తద్వారా షుగర్ లేనివాళ్లకు ఎలా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో, అలాగే ఈ ఇంజెక్షన్ షుగర్ ఉన్నవాళ్లకు కూడా సహజంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది సహజంగా ఉండే హార్మోన్‌లా పని చేస్తుంది. దీని ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement