Combination Drugs | 16 కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం.. వెంటనే అమలు..
Combination Drugs | ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధాల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్స పరంగా సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని, వాటి వల్ల కలిగే ప్రయోజనం తక్కువగా ఉందని తేలడంతో 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్రం నిషేధం విధించింది.
Combination Drugs | ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధాల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్స పరంగా సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని, వాటి వల్ల కలిగే ప్రయోజనం తక్కువగా ఉందని తేలడంతో 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్రం నిషేధం విధించింది. ఎఫ్‌డీసీ మందులు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐలు)ను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి తయారు చేసే ఔషధాలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ తరహా ఔషధాలపై సమీక్ష చేపట్టిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వివిధ ఔషధ కలయికలను పరిశీలించి, అవి చికిత్సాపరంగా సమర్థవంతమైనవా, హేతుబద్ధమైనవా లేదా హానికరమా అనే అంశాలను విశ్లేషించింది. ఈ సమీక్షలో 16 ఔషధ కలయికలను శాస్త్రీయంగా సమర్థించలేనివిగా గుర్తించారు.
ఎలాంటి ప్రయోజనం లేదు..
ఈ నేపథ్యంలో గుర్తించిన 16 ఎఫ్‌డీసీ ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీ, సరఫరాపై దేశవ్యాప్తంగా తక్షణమే నిషేధం అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని, వాటి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలతో పోలిస్తే ప్రజలకు గణనీయమైన ప్రయోజనం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిషేధానికి గురైన ఔషధాల్లో చర్మ సంరక్షణ ఉత్పత్తులు, నొప్పి నివారణ మందులు, కండరాల సడలింపు మందులు, యాంటీ బయోటిక్ ఆధారిత కాంబినేషన్లు ఉన్నాయి. అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్-ఎథోహెప్టజైన్, డైసైక్లోమైన్-పారాసిటమాల్-క్లిడినియం బ్రోమైడ్, డైసైక్లోమైన్-పారాసిటమాల్-క్లిడినియం బ్రోమైడ్-క్లోర్డియాజెపాక్సైడ్, గ్లిక్లాజైడ్-క్రోమియం పికోలినేట్, పారాసిటమాల్-లిగ్నోకైన్ వంటి కాంబినేషన్ మందులు నిషేధిత జాబితాలో ఉన్నాయి.
యాంటీ బయోటిక్ మందులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు..
అలాగే అమోక్సిసిలిన్-సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్-సెరాటియోపెప్టిడేస్-లాక్టోబాసిల్లస్ స్పోరోజెన్స్, అమోక్సిసిలిన్-క్లోక్సాసిల్లిన్-లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్-సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్-ప్రోబెనెసిడ్, సెఫ్యూరోక్సైమ్-సెరాటియోపెప్టిడేస్ వంటి పలు యాంటీ బయోటిక్ కాంబినేషన్లను కూడా కేంద్రం నిషేధించింది. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో అలోవెరా లేదా అలో ఎక్స్‌ట్రాక్ట్‌తోపాటు విటమిన్ ఈ, జోజోబా ఆయిల్, ఆరెంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అలాంటోయిన్, డి-పాంథెనాల్ వంటి పదార్థాలు కలిపిన కొన్ని ఫార్ములేషన్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26ఎ కింద జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఈ నిషేధాన్ని అమలు చేసినట్లు కేంద్రం తెలిపింది. గతంలోనూ శాస్త్రీయ సమీక్షల అనంతరం అనేక హేతుబద్ధత లేని ఎఫ్‌డీసీ మందులను నిషేధించిన విషయాన్ని మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది.
ఈ నిర్ణయం అమలులో కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, నియంత్రణ సంస్థలు, అమలు సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర భాగస్వాములు చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
- ●Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ టెస్ట్..
- ●Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు
- ●Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్టీఏ
- ●Rukmini Vasanth | రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో - ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- ●Cantonment Land Scam | కంటోన్మెంట్లో రూ.800 కోట్ల ల్యాండ్ స్కామ్.. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు
- ●Indira Mahila Shakti | మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం : మంత్రి మహ్మద్ అజారుద్దీన్

Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ టెస్ట్..

Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు

Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్టీఏ

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో - ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు




