Winter Foods | వెచ్చదనం, ఇమ్యూనిటీ.. రెండింటినీ ఇచ్చే ఆహారాలు ఇవి.. ఈ సీజన్‌లో తీసుకోవాల్సిందే..!
Winter Foods | చలికాలంలో ఆరోగ్యపరంగా మన శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఈ సీజన్‌లో తీవ్రంగా ఉండే చలి, రోజు రోజుకీ పడిపోయే ఉష్ణోగ్రతల కారణంగా రోగ నిరోధక వ్యవస్థ సైతం బలహీనంగా మారుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ క్రమంలో అలర్జీలు, చర్మం పొడిగా మారడం, గొంతు సమస్యలు, దగ్గు వస్తుంటాయి.
Winter Foods | చలికాలంలో ఆరోగ్యపరంగా మన శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఈ సీజన్‌లో తీవ్రంగా ఉండే చలి, రోజు రోజుకీ పడిపోయే ఉష్ణోగ్రతల కారణంగా రోగ నిరోధక వ్యవస్థ సైతం బలహీనంగా మారుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ క్రమంలో అలర్జీలు, చర్మం పొడిగా మారడం, గొంతు సమస్యలు, దగ్గు వస్తుంటాయి. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి అంటే కేవలం ఒక్క రోజులో మ్యాజిక్ చేసినట్లు ట్యాబ్లెట్ల ద్వారా పెరగదని, ఆహారాల విషయంలో మనం చేసే మార్పుల వల్లే రోగ నిరోధక శక్తి పెరగడం, తగ్గడం జరుగుతుందని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ అలోక్ చోప్రా తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్లపై ఆధార పడకూడదని, ఆహారం ద్వారా సహజంగానే ఆ శక్తి పెరుగుతుందని అన్నారు.
ఆవాలు..
చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు అనేక ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు వస్తుంటాయి. ఈ సమయంలో సీజనల్‌గా లభించే ఆహారాలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను, శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల చలి నుంచి రక్షణ లభించడమే కాకుండా రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు.. అని డాక్టర్ చోప్రా వెల్లడించారు. ఇక ఈ సీజన్‌లో పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి క్రమంగా పెరుగుతుందని, దీని వల్ల వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చని అన్నారు. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో ఆవాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. కనుక చలికాలంలో వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆవాలను తీసుకోవడం వల్ల అనేక విటమిన్లు, మినరల్స్‌ను పొందవచ్చు. వీటిల్లో విటమిన్లు ఎ, సి, కె ఉంటాయి. ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల చలికాలంలో సహజంగానే ఉండే మలబద్దకం తగ్గుతుంది. అలాగే శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పసుపు, ఖర్జూరాలు..
ఇక చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారాల్లో పసుపు కూడా ఒకటని డాక్టర్ చోప్రా తెలిపారు. పసుపులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. పసుపును తీసుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రాత్రి పూట గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి తాగితే మేలు జరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఈ సీజన్‌లో రోజూ ఖర్జూరాలను తినాలని ఆయన సూచించారు. ఖర్జూరాలలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరాలు వేడిని పెంచుతాయి. కనుక చలికాలంలో వీటిని తింటే చలి నుంచి రక్షణ లభిస్తుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే ఖర్జూరాల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీ తగ్గేలా చేస్తుంది. వీటిల్లో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కండరాలు పట్టుకుపోకుండా చూస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. కనుక చలికాలంలో ఖర్జూరాలను రోజూ తినాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఉసిరి, నువ్వులు..
ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. త్రిఫలాల్లో దీన్ని కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కనుక ఈ సీజన్ లో ఉసిరికాయలను తినడం లేదా ఉసిరికాయల రసాన్ని తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం పగలకుండా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. శిరోజాలను సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక చలికాలంలో తినాల్సిన ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటి. ఇవి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ సీజన్ లో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే నువ్వుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. నువ్వులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా ఆయా ఆహారాలను ఈ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ చోప్రా వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






