Sugar Vs Jaggery | చక్కెరతో పోలిస్తే బెల్లం నిజంగానే ఆరోగ్యకరమైన ఆహారమా..?
Sugar Vs Jaggery | ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే తీపి పదార్థాలను తినడం తగ్గిస్తున్నారు లేదా పూర్తిగా మానేస్తున్నారు. అయితే చక్కెర, బెల్లం విషయానికి వస్తే.. ఈ రెండింటిలో అనారోగ్యకరమైన పదార్థం ఏది..? అంటే కచ్చితంగా చక్కెర.. అనే ఎవరైనా బదులిస్తారు. ఎందుకంటే చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు.
Sugar Vs Jaggery | ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే తీపి పదార్థాలను తినడం తగ్గిస్తున్నారు లేదా పూర్తిగా మానేస్తున్నారు. అయితే చక్కెర, బెల్లం విషయానికి వస్తే.. ఈ రెండింటిలో అనారోగ్యకరమైన పదార్థం ఏది..? అంటే కచ్చితంగా చక్కెర.. అనే ఎవరైనా బదులిస్తారు. ఎందుకంటే చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు. పూర్తిగా రీఫైన్ చేసి దీన్ని తయారు చేస్తారు. బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు. అందులో పోషకాలు కూడా ఉంటాయి. కనుక బెల్లం ఆరోగ్యకరమైందని అంటారు. అయితే జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్, జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ ఇదే విషయాన్ని చెప్పారు. బెల్లంలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కానీ చక్కెరలో ఉండవు. కనుక బెల్లాన్ని సైంటిస్టులు ఆరోగ్యకరమైన ఆహారంగా పేర్కొన్నారు.
సైన్స్ కూడా అంగీకారం..
చక్కెర, బెల్లం తయారీ ప్రక్రియలు చాలా భిన్నంగా ఉంటాయి. రిఫైన్డ్ షుగర్‌ను తయారు చేయడానికి రసాయన శుద్ధి, బ్లీచింగ్, క్రిస్టలైజేషన్ వంటి అనేక చర్యలు చేపడతారు. ఈ క్రమంలో అందులో మిగిలేది కేవలం సుక్రోజ్ మాత్రమే. అందులో ఎలాంటి ఖనిజాలు, విటమిన్లు ఉండవు. ఇక బెల్లాన్ని మాత్రం చెరకు లేదా తాటి రసాన్ని మరిగించి తయారు చేస్తారు. అందులో సహజ మోలాసెస్ అలాగే ఉండటం వల్ల ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, పొటాషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తం తయారీ, ఎముకల నిర్మాణం, నాడుల పనితీరుకు ఎంతో దోహదం చేస్తాయి. ఆయుర్వేద గ్రంథాలలో బెల్లాన్ని గుడగా పేర్కొంటూ, శరీరంలోని దోషాల సమతుల్యతకు ఇది సహాయపడుతుందని చెప్పారు. రక్త శుద్ధి, జీర్ణక్రియ మెరుగుదల, రోగనిరోధక శక్తి పెంపులో బెల్లం కీలక పాత్ర పోషిస్తుందని సంప్రదాయ వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వారు ఎప్పుడో గ్రంథాల్లో చెప్పిన విషయాలను ఇప్పుడు అధునాతన సైన్స్ కూడా నిజమే అని అంగీకరిస్తోంది.

చక్కెరతో అనేక సమస్యలు..
అయితే చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా అది టైప్ 2 డయాబెటిస్‌కు సైతం దారి తీస్తుంది. అలాగే అధిక చక్కెర వల్ల చర్మంలోని కొల్లాజెన్ నశిస్తుంది. దీంతో చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. సాధారణ దగ్గు, జలుబు వంటి సమస్యలు దీర్ఘకాలంగా ఉంటాయి. కనుకనే ఒకప్పుడు మన పెద్దలు చక్కెర అధికంగా ఉండే చాక్లెట్లను తింటే దగ్గు, జలుబు వస్తాయని చెప్పేవారు. అది నిజమే అని తేలింది. ఇక అధికంగా చక్కెరను తీసుకుంటే లివర్‌పై భారం పడుతుంది. లివర్‌లో కొవ్వు అధికంగా చేరి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
బెల్లాన్ని ఎలా తింటున్నామన్నది ముఖ్యం..
ఇక చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమైన ఆహారం అని వైద్యులు చెబుతున్నారు. రెండూ తీపి కలిగిన పదార్థాలే అయినప్పటికీ బెల్లం తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ నియంత్రణలోనే ఉంటుంది. శరీరానికి నిరంతరం నెమ్మదిగా శక్తి లభిస్తుంది. కనుక ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, బెల్లాన్ని ఎలా తింటున్నామనే విషయంపై మనకు లభించే క్యాలరీలు ఆధారపడతాయి. అంటే ఇతర అనారోగ్యకరమైన ఆహారాలతో దాన్ని కలిపి తింటే అప్పుడు మనకు బెల్లం ద్వారా లాభాలు లభించవు. నష్టమే ఎక్కువగా జరుగుతుంది. శరీరంలో క్యాలరీలు అధికంగా చేరుతాయి. కానీ బెల్లాన్ని నేరుగా లేదా పల్లీలు వంటి గింజలతో కలిపి తింటే మనకు లాభం ఎక్కువ జరుగుతుంది. ఈ విధంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల మనకు మేలు చేస్తుందని సైంటిస్టుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



