Eggs | కోడిగుడ్లను అసలు రోజుకు ఎన్ని తినాలి..? పచ్చ సొనను తినవచ్చా..?
Eggs | కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాదాపుగా ఉంటాయి. అందుకనే కోడిగుడ్లను పోషకాలకు గనిగా చెబుతుంటారు. వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా పిలుస్తుంటారు. అందుకనే కోడిగుడ్లను తరచూ తినాలని పోషకాహార వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే కోడిగుడ్లను తినడంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి.
Eggs | కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాదాపుగా ఉంటాయి. అందుకనే కోడిగుడ్లను పోషకాలకు గనిగా చెబుతుంటారు. వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా పిలుస్తుంటారు. అందుకనే కోడిగుడ్లను తరచూ తినాలని పోషకాహార వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే కోడిగుడ్లను తినడంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా పచ్చ సొనను తినాలా, వద్దా, గుడ్లను అసలు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు.. వంటి సందేహాలు చాలా మందికి వస్తాయి. అయితే వీటికి న్యూట్రిషనిస్టు శాలిని సుధాకర్ సమాధానాలు చెబుతున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. కోడిగుడ్లను తినే విషయంలో చాలా మందికి ఎదురయ్యే పలు సహజమైన సందేహాలకు సమాధానాలను ఆమె వివరించారు.
చాలా మంది చేసే తప్పులు ఇవే..
కోడిగుడ్లను తినడంలో చాలా మంది రెండు రకాల తప్పులను చేస్తున్నారని శాలిని తెలిపారు. గుడ్లను అధికంగా క్యాలరీలు వచ్చే విధంగా తింటారు. అలాగే సరైన విధానంలో తీసుకోరు. ఇలా రెండు రకాలుగా తప్పులు చేస్తుంటారు. దీని వల్ల గుడ్లలో ఉండే పోషకాలు మనకు సరిగ్గా లభించవు. అనేక పోషకాలను కోల్పోతారు. ఈ క్రమంలో అలాంటి గుడ్లను తింటే శరీరంలో కొవ్వు చేరుతుంది. అది వ్యాధులకు కారణం అవుతుంది. కనుక కోడిగుడ్లను సరైన పద్ధతిలో తినాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. కోడిగుడ్లను తినడంలో ఉండే సందేహాల వల్ల చాలా మంది గుడ్లను తినకుండా పక్కన పెడుతుంటారు. కానీ అలా చేసినా కూడా గుడ్లలో ఉండే పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. కనుక సరైన రీతిలో గుడ్లను తినాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

కోడిగుడ్లలో ఉండే పోషకాలు..
ఒక సాధారణ సైజులో ఉండే కోడిగుడ్డును తింటే మనకు దాదాపుగా 7 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే గుడ్లలో విటమిన్లు ఎ, బి12లతోపాటు ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ సూక్ష్మ పోషకాలు కనుక మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి. కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని అందించడంలో దోహదం చేస్తాయి. అలాగే కోడిగుడ్లను తినడం వల్ల లభించే బి విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. మెటబాలిజం మెరుగు పడి జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. గుడ్లలో ఉండే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఇలా గుడ్లను తింటే అనేక లాభాలు కలుగుతాయి.
ఆరోగ్యవంతులు అయితే..
ఆరోగ్యంగా ఉన్నవారు పెద్దలు అయితే రోజుకు 2 గుడ్లను తినవచ్చు. కానీ పచ్చసొనను పడేయకూడదు. దాన్ని కూడా తినాల్సి ఉంటుంది. అందులోనే ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. కనుక పచ్చ సొనను పడేయకుండా తినాల్సి ఉంటుంది. అయితే అధిక బరువు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు కోడిగుడ్లను తినడంలో జాగ్రత్తలు వహించాలని శాలిని తెలిపారు. పోషకాహార నిపుణులు లేదా వైద్యుల సూచన మేరకు అలాంటి వారు గుడ్లను తినాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఆయా సమస్యలు ఉన్నవారు రోజుకు 2 వరకు తెల్ల సొనలను భేషుగ్గా తినవచ్చని, కానీ పచ్చసొనను ఒకటే తినాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇలా గుడ్లను తింటే అనేక లాభాలను పొందవచ్చని తెలిపారు. అయితే కోడిగుడ్లను ఉడకబెట్టి తింటేనే అధిక మొత్తంలో పోషకాలు మనకు లభిస్తాయని ఆమె తెలిపారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



