Proteins Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీకు ప్రోటీన్లు సరిగ్గా లభించడం లేదని అర్థం..!
Proteins Deficiency Symptoms | మన శరీరానికి శక్తిని అందించడంలో ప్రోటీన్లు ఉపయోగపడతాయి. కండరాల పనితీరుకు, కండరాల నిర్మాణానికి కూడా మనకు ప్రోటీన్లు అవసరం. ప్రోటీన్లను స్థూల పోషకాలు అంటారు. ఇవి మనకు రోజూ అధిక మొత్తంలో కావల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది ప్రోటీన్లను సరిగ్గా తీసుకోవడం లేదు.
Proteins Deficiency Symptoms | మన శరీరానికి శక్తిని అందించడంలో ప్రోటీన్లు ఉపయోగపడతాయి. కండరాల పనితీరుకు, కండరాల నిర్మాణానికి కూడా మనకు ప్రోటీన్లు అవసరం. ప్రోటీన్లను స్థూల పోషకాలు అంటారు. ఇవి మనకు రోజూ అధిక మొత్తంలో కావల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది ప్రోటీన్లను సరిగ్గా తీసుకోవడం లేదు. దీని వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రోటీన్లను సరిగ్గా తీసుకోకపోతే మన శరీరం మనకు తరచూ పలు లక్షణాలు, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా మనకు ప్రోటీన్లు సరిగ్గా లభించడం లేదన్న విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రోటీన్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటే ఆయా లక్షణాలు తగ్గిపోతాయి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.
తీవ్రమైన ఆకలి..
ప్రోటీన్లను సరిగ్గా తీసుకోకపోతే తిన్న వెంటనే మళ్లీ ఆకలి అవుతుంది. ఎంత ఆహారం తిన్నా కూడా మళ్లీ వెంటనే ఆకలి అవుతుంది అంటే డయాబెటిస్ అయి ఉండాలి, లేదా ప్రోటీన్లను సరిగ్గా తినకపోవడం అన్నా అయి ఉండాలి. మీకు షుగర్ లేకపోతే తిన్న వెంటనే ఆకలి అవుతుందంటే దాన్ని కచ్చితంగా ప్రోటీన్ల లోపంగానే భావించాలి. ఈ క్రమంలోనే ప్రోటీన్లు ఉండే ఆహారాలను తింటే ఆ సమస్య తగ్గుతుంది. అలాగే రోజూ చేసే చిన్న చిన్న పనులను కూడా సరిగ్గా చేయలేకపోతుంటే మీలో ప్రోటీన్ల లోపం ఉందని లేదా ప్రోటీన్లు ఉండే ఆహారాలను సరిగ్గా తీసుకోవడం లేదని అర్థం. ప్రోటీన్లు సరిగ్గా లభించకపోతే మనకు రోజువారి పనులకు కావల్సిన శక్తి లభించదు. దీంతో నీరసంగా మారుతారు. అలసటగా ఉంటుంది. ఏ పనులను కూడా చేయలేకపోతారు. కనుక ఈ లక్షణాలు కనిపిస్తున్నా ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఆలస్యంగా మానడం..
వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తే కండరాలు విచ్ఛిన్నం అవుతాయి. ఆ తరువాత వాటి స్థానంలో కొత్త కండరాలు నిర్మాణమవుతాయి. అయితే ఆయా పనులను చేసిన తరువాత కూడా చాలా సేపటి వరకు నొప్పులు అధికంగా ఉంటుంటే మీకు ప్రోటీన్లు సరిగ్గా లభించడం లేదని అర్థం. అలాంటి సమయంలో కూడా ప్రోటీన్లను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గాయాలు అయినప్పుడు లేదా దెబ్బలు తగిలినప్పుడు చాలా నెమ్మదిగా మానుతున్నా కూడా మీకు ప్రోటీన్లు సరిగ్గా లభించడం లేదని గుర్తించాలి.
జుట్టు రాలడం..
ప్రోటీన్ల లోపం ఉన్నవారు లేదా ప్రోటీన్లను సరిగ్గా తీసుకోని వారు జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటారు. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ప్రోటీన్లు ఎంతో దోహదం చేస్తాయి. అవి సరిగ్గా లభించకపోతే జుట్టు బాగా రాలుతుంది. కనుక ఈ సమస్య ఉన్నవారు కూడా ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తరచూ గోర్లు చిట్లిపోయి బలహీనంగా మారడం, తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడడం, తీవ్రమైన దాహం ఉండడం, నోటి దుర్వాసన అధికంగా రావడం వంటివన్నీ ప్రోటీన్ల లోపాన్ని తెలియజేస్తాయి. అలాంటి వారు ప్రోటీన్లను రోజూ తగిన మోతాదులో లభించేలా చూసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



