White Vs Pink Guava | తెలుపు వర్సెస్ పింక్.. ఏ రంగులో ఉండే జామ పండ్లను తింటే మంచిది..?
White Vs Pink Guava | జామ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
White Vs Pink Guava | జామ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. పోషకాహార లోపం నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలకు వివిధ రకాల వెరైటీల్లో ఉండే జామ పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మన దేశంలో మాత్రం చాలా వరకు జామ పండ్లు తెలుపు, పింక్ రంగులలో లభిస్తాయి. జామ పండ్ల లోపలి గుజ్జు రకాన్ని బట్టి ఆయా రంగుల్లో ఉంటుంది. ఎక్కువ శాతం మంది తెల్ల రంగులో గుజ్జు కలిగిన జామ పండ్లను తింటుంటారు. అయితే ఈ రెండు రకాల జామ పండ్లకు తేడా ఏమిటి.. వేటిల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.. వేటిని తినడం వల్ల మనకు ఎక్కువ శాతం లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను పోషకాహార వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
తెలుపు రంగు పండ్లలో..
తెలుపు రంగులో ఉండే జామ పండ్లు కాస్త తియ్యగా ఉంటాయి. ఈ పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. పిండి పదార్థాలు, విత్తనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. విటమిన్ సి కూడా ఈ పండ్లలో అధికంగానే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గడంలో ఈ పండ్లు సహాయం చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుతాయి. షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయం చేస్తాయి. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి కనుక వీటిని తింటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా తెలుపు రంగు జామ పండ్లు మనకు మేలు చేస్తాయి.

పింక్ పండ్లు అయితే..
పింక్ రంగు జామ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. చక్కెర తక్కువగా ఉంటుంది. కనుక తెలుపు రంగు పండ్లతో పోలిస్తే ఇవి రుచి కాస్త చప్పగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి కూడా తక్కువగానే ఉంటుంది. కానీ పింక్ రంగు జామ పండ్లలో తెలుపు వాటి కన్నా కెరోటినాయిడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా పింక్ రంగు పండ్లలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన సమ్మేళనంగా పనిచేస్తుంది. మనకు అనేక లాభాలను అందిస్తుంది. పింక్ రంగులో ఉండే జామ పండ్లను తినడం వల్ల లైకోపీన్ అధికంగా లభించి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ఎ అధికంగా ఉంటుంది కనుక కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లను సైతం పొందవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి పింక్ రంగు పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
వేటిని తినాలి..?
అయితే ఏ రంగులో ఉన్న జామ పండ్లను తినాలి..? అని చాలా మందికి సందేహం వస్తుంది. కానీ ఏ రంగులో ఉన్న పండ్లను తిన్నా సరే మనకు కామన్‌గా కొన్ని లాభాలు ఉంటాయి. ఇక షుగర్ ఉన్నవారు, కంటి చూపు సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలని చూసే వారు పింక్ రంగు జామ పండ్లను తినడం మంచిది. ఇతరులు ఎవరైనా తెలుపు రంగు పండ్లను తింటే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



