Norovirus | చైనాలో నోరోవైరస్ కలకలం.. 103 మంది విద్యార్థులకు ఇన్‌ఫెక్షన్..
Norovirus | దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, ఫోషాన్ నగరంలో ఉన్న ఓ సీనియర్ హై స్కూల్‌లో 103 మంది విద్యార్థులు నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి తీవ్ర పరిస్థితులు లేదా మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.
Norovirus | దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, ఫోషాన్ నగరంలో ఉన్న ఓ సీనియర్ హై స్కూల్‌లో 103 మంది విద్యార్థులు నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి తీవ్ర పరిస్థితులు లేదా మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. నోరోవైరస్ అనేది సాధారణంగా తీవ్ర గ్యాస్ట్రోఎంటరైటిస్‌కు కారణమయ్యే వైరస్. దీనివల్ల వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జింగ్‌హుయ్ మిడిల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురికాగా, ప్రాథమిక వైద్య పరీక్షల్లో అది నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్‌గా నిర్ధారణైంది.
చలికాలంలో ఎక్కువగా..
అనారోగ్యానికి గురైన 103 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా డిస్ఇన్‌ఫెక్ట్ చేయగా, విద్యార్థులపై నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై ఎపిడెమియాలజికల్ సర్వే కూడా కొనసాగుతోందని తెలిపారు. కాగా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ వ్యాధి నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి తదుపరి సంవత్సరం మార్చి వరకు నోరోవైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్‌హువా వెల్లడించింది. నోరోవైరస్ అనేది తీవ్ర వాంతులు, విరేచనాలకు కారణమయ్యే వైరస్‌ల సమూహం. ఇది అత్యంత సులభంగా వ్యాపించే అంటువ్యాధి కాగా చల్లని వాతావరణం లేదా చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
చిన్నారుల్లోనే అధికం..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారుగా 685 మిలియన్ల నోరోవైరస్ కేసులు నమోదవుతున్నట్లు అంచనా. వీటిలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లోనే 200 మిలియన్ల కేసులు నమోదు అయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. నోరోవైరస్ కారణంగా ప్రతి ఏడాది దాదాపుగా 2 లక్షల మంది మృతి చెందుతుండగా అందులో 50 వేల మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాలు ఈ వ్యాధి ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నాయి. ఆరోగ్య ఖర్చులు, ఆర్థిక నష్టాల రూపంలో ప్రపంచానికి ఏటా సుమారుగా 60 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు.
ఇన్‌ఫ్లుయెంజాకు భిన్నం..
నోరోవైరస్ ను మొదటి సారిగా 1968లో అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, నోర్వాక్ పట్టణంలోని ఓ పాఠశాలలో గుర్తించారు. అందుకే మొదటి స్ట్రెయిన్‌ను నోర్వాక్ వైరస్ అని పిలిచారు. నోరోవైరస్ వల్ల వచ్చే గ్యాస్ట్రోఎంటరైటిస్‌ను కొందరు స్టమక్ ఫ్లూ అని పిలుస్తారు. అయితే, ఇది శ్వాసకోశాన్ని ప్రభావితం చేసే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌కు పూర్తిగా భిన్నమైనదని వైద్యులు స్పష్టం చేశారు. భూమధ్యరేఖకు పైభాగంలో ఉన్న దేశాల్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు, దిగువ భాగంలో ఉన్న దేశాల్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నోరోవైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. భూమధ్యరేఖకు సమీప ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేక సీజన్ అంటూ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Donald Trump | జిన్‌పింగ్ స్నేహితుడిగా ఉండటం నాకు గర్వకారణం : ట్రంప్
మే 14, 2026

Hantavirus | ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. ‘హంటా’.. ఏంటిది, ఎలా వ్యాప్తి చెందుతుంది..?
మే 8, 2026

Advanced Protection | ఆండ్రాయిడ్ 16లో కొత్త ఫీచర్.. దీన్ని ఆన్ చేస్తే మీ ఫోన్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరు..
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



