IIT Roorkee | చికున్‌గున్యాకు గోమూత్రంతో విజయవంతంగా చికిత్స.. వెల్లడించిన ఐఐటీ రూర్కీ..
IIT Roorkee | భారత్‌లో ప్రతి ఏడాది చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ శాస్త్రవేత్తలు గోమూత్ర సారం (కౌ యూరిన్ డిస్టిలేట్ - సీయూడీ)లో చికున్‌గున్యా వైరస్‌పై ప్రభావం చూపే శక్తి ఉన్న కీలక బయో యాక్టివ్ సమ్మేళనాలను గుర్తించారు.
IIT Roorkee | భారత్‌లో ప్రతి ఏడాది చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ శాస్త్రవేత్తలు గోమూత్ర సారం (కౌ యూరిన్ డిస్టిలేట్ - సీయూడీ)లో చికున్‌గున్యా వైరస్‌పై ప్రభావం చూపే శక్తి ఉన్న కీలక బయో యాక్టివ్ సమ్మేళనాలను గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలను ఏసీఎస్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ఐఐటీ రూర్కీ బయోసైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శైలీ తోమర్ నేతృత్వంలోని బృందం, దేశంలోని ప్రముఖ ఆయుర్వేద, బయోమెడికల్ సంస్థల పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గోమూత్ర సారంతో చికిత్స చేసినప్పుడు సురక్షిత స్థాయిల్లో చికున్‌గున్యా వైరల్ లోడ్ 90 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించారు. అలాగే గోమూత్ర సారం, నిగెల్లా సటీవా (బ్లాక్ సీడ్) నుంచి లభించే థైమోక్వినోన్, మిరియాల నుంచి లభించే పైపరిన్‌లను కలిపి తయారుచేసిన ప్రత్యేక మిశ్రమం ప్రయోగశాల పరిస్థితుల్లో వైరల్ లోడ్‌ను 99.85 శాతం వరకు తగ్గించినట్లు వెల్లడైంది.
కీలకంగా పనిచేసిన మూడు సమ్మేళనాలు..
ఈ అధ్యయనంలో వైరాలజీ, మెటబొలోమిక్స్, మాలిక్యులర్ డాకింగ్, బయోకెమికల్ విశ్లేషణలు వంటి ఆధునిక శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించారు. పరిశోధనలో బెంజోయిక్ యాసిడ్, హిప్యూరిక్ యాసిడ్, ఒలీక్ యాసిడ్ అనే మూడు సమ్మేళనాలు వైరస్ నిరోధక చర్యలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఇవి వైరస్ తన ప్రతిరూపాలను తయారు చేసుకోవడానికి అవసరమైన ముఖ్యమైన ప్రోటీన్ల పనితీరును అడ్డుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. దీంతో భవిష్యత్తులో యాంటీ వైరల్ ఔషధాల అభివృద్ధికి ఇవి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధనలో భాగంగా చికున్‌గున్యా వైరస్ సోకిన కణాలు కలిగిన ప్రయోగశాల పాత్రల్లో గోమూత్ర సారాన్ని స్వల్ప మోతాదుల్లో కలిపారు. 2 శాతం సాంద్రత వద్ద వైరస్ స్థాయి సుమారు 90 శాతం తగ్గగా, 4 శాతం సాంద్రత వద్ద 99 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించారు.
త్రివిధ మిశ్రమం 99 శాతం ప్రభావం..
ద్రవంలో ఉన్న రసాయన సమ్మేళనాలను విశ్లేషించేందుకు ప్రత్యేక రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం కంప్యూటర్ సిమ్యులేషన్ల సహాయంతో అవి వైరస్‌తో ఎలా పరస్పర చర్య చేస్తాయో అధ్యయనం చేశారు. ఈ ప్రక్రియలో మూడు ముఖ్య సమ్మేళనాలు చికున్‌గున్యా వైరస్ విస్తరణకు అవసరమైన ఒక కీలక ఎంజైమ్‌ను అడ్డుకుంటున్నట్లు తేలింది. అలాగే గోమూత్ర సారాన్ని బ్లాక్ సీడ్‌లో లభించే థైమోక్వినోన్, మిరియాల్లో ఉండే పైపరిన్‌తో కలిపి పరీక్షించారు. ఈ మూడు పదార్థాల మిశ్రమం ఒక్కో పదార్థం వేర్వేరుగా చూపిన ప్రభావం కంటే చాలా మెరుగ్గా పనిచేసింది. ఈ త్రివిధ మిశ్రమం వైరస్‌లో 99.85 శాతం వరకు నిర్మూలన సాధించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఐఐటీ రూర్కీ డైరెక్టర్ కమల్ కిశోర్ పంత్ మాట్లాడుతూ కొత్తగా ఉద్భవిస్తున్న, మళ్లీ వ్యాప్తి చెందుతున్న వైరల్ వ్యాధులకు వినూత్నమైన, అందుబాటులో ఉండే, శాస్త్రీయమైన నిర్ధారిత పరిష్కారాలు అవసరమని చెప్పారు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక బయోటెక్నాలజీతో అనుసంధానిస్తూ ప్రపంచ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఐఐటీ రూర్కీ పరిశోధనలు చేపడుతోందని తెలిపారు.
మరిన్ని ట్రయల్స్ అవసరం..
ప్రొఫెసర్ శైలీ తోమర్ మాట్లాడుతూ ఆయుర్వేద గౌమూత్ర అర్క్‌లోని నిర్దిష్ట బయోఆక్టివ్ అణువులను గుర్తించడంతోపాటు సహజ పదార్థాల సమ్మిళిత వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తమ అధ్యయనం చూపించిందన్నారు. చికున్‌గున్యా మాత్రమే కాకుండా ఇతర సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా భవిష్యత్తులో కొత్త యాంటీవైరల్ వ్యూహాల అభివృద్ధికి ఈ ఫలితాలు పునాది వేస్తాయని తెలిపారు. అయితే క్లినికల్ వినియోగానికి ముందు మరిన్ని ప్రీ-క్లినికల్, ట్రాన్స్‌లేషనల్ అధ్యయనాలు అవసరమని స్పష్టం చేశారు. అయితే ఈ అధ్యయనం గోమూత్రాన్ని నేరుగా చికున్‌గున్యా చికిత్స కోసం ఉపయోగించాలని సూచించడం లేదని పరిశోధకులు స్పష్టంచేశారు. అలాగే గోమూత్రం వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం లభించిన ఫలితాలు పూర్తిగా ప్రయోగశాల స్థాయిలోనే నమోదయ్యాయి. మానవులపై సురక్షిత వినియోగ స్థాయిలు, చికిత్సా ప్రయోజనాలను నిర్ధారించడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్, విస్తృత పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.
సంబంధిత వార్తలు

IIT Roorkee | క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్లో సమస్య వాస్తవమే.. కానీ,.. డేటా లీక్ ఆరోపణలపై ఐఐటీ రూర్కీ క్లారిటీ
జూన్ 5, 2026

Dasoju Sravan | స్టూడెంట్స్ డేటానే ఈజీగా లీక్ చేశారు.. రేపు క్వశ్చన్ పేపర్లు భద్రంగా ఉంటాయన్న గ్యారెంటి ఏంటి?: దాసోజు శ్రావణ్
జూన్ 5, 2026

JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. 56 వేల మంది ఉత్తీర్ణత
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●International Police Expo 2026 | ఢిల్లీలో కొలువుదీరిన ఏఐ గన్స్ : ఆకట్టుకుంటున్న 'ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో 2026'
- ●Rains | సాయంత్రం హైదరాబాద్‌లో మోస్తరు వర్షం..!
- ●HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!
- ●Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..
- ●Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్ష్యం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్
- ●Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?

International Police Expo 2026 | ఢిల్లీలో కొలువుదీరిన ఏఐ గన్స్ : ఆకట్టుకుంటున్న 'ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో 2026'

Rains | సాయంత్రం హైదరాబాద్‌లో మోస్తరు వర్షం..!

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!

Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..



