Calcium Carbide | కాల్షియం కార్బైడ్ తో పండ్లను పండిస్తే కఠిన చర్యలు: FSSAI
Calcium Carbide | వేసవిలో చాలా మంది విక్రేతలు మామిడి పండ్లను రసాయనాలతో పండించి మార్కెట్లలోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రాష్ట్రాల ఆహార కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫ్రూట్ మార్కెట్లు, గోడౌన్‌లలో నిషేధిత కృత్రిమ పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సూచించింది.
Calcium Carbide | వేసవిలో చాలా మంది విక్రేతలు మామిడి పండ్లను రసాయనాలతో పండించి మార్కెట్లలోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రాష్ట్రాల ఆహార కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫ్రూట్ మార్కెట్లు, గోడౌన్‌లలో నిషేధిత కృత్రిమ పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సూచించింది. పండ్లను విక్రయించే సమయంలో లేదా నిల్వ చేసే సమయంలో కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత కృత్రిమ పదార్థాలు లేదా అనధికార రసాయనాల వినియోగాన్ని పర్యవేక్షించాలని రాష్ట్రాల ఆహార కమిషనర్లకు సూచనలు చేసింది.
కాల్షియం కార్బైడ్ వాడకంపై నిషేధం..
మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను త్వరగా పండించేందుకు ఉపయోగించే కాల్షియం కార్బైడ్ ను నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధించామని సంస్థ స్పష్టం చేసింది. కాల్షియం కార్బైడ్ వాడకం వల్ల పండ్లను తిన్న వారిలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని FSSAI హెచ్చరించింది. కాల్షియం కార్బైడ్ వల్ల మింగడంలో ఇబ్బందులు, వాంతులు, చర్మంపై దురదలు రావడం, పుండ్లు ఏర్పడడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలియజేసింది. అలాగే కొంతమంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (FBOs) అరటి, ఇతర పండ్లను కృత్రిమంగా పండించేందుకు ఎథెఫాన్ ద్రావణంలో ముంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంస్థ తెలిపింది.
ఎథిలీన్‌ను వాడాలి..
పండ్లను సురక్షితంగా పండించేందుకు ఎథిలీన్ వాయువును ఉపయోగించాలని మార్గదర్శకాలు ఉన్నాయని FSSAI స్పష్టం చేసింది. అయితే ఎథిలీన్ వాయువును వాడే విషయంలోనూ పలు సూచనలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ఎథిలీన్ పొడి లేదా ద్రవం కూరగాయలు లేదా పండ్లకు నేరుగా తగలకుండా చూడాలని స్పష్టత ఇచ్చింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ఆహార భద్రత కమిషనర్లు, FSSAI ప్రాంతీయ డైరెక్టర్లు పండ్ల మార్కెట్లు, మండీలు, నిల్వ కేంద్రాలు, హోల్ సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కఠినమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. ముఖ్యంగా సీజనల్ పండ్లను నిల్వ చేసే ప్రదేశాల్లో పెద్ద ఎత్తున కార్బైడ్ ను వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి..
కాల్షియం కార్బైడ్‌ను లేదా అలాంటి ఇతర పదార్థాలను వాడేందుకు అనుమతి లేదని, పండ్లను పండించేందుకు కృత్రిమ రంగులు లేదా రసాయనాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని FSSAI సూచించింది. పండ్లను నిల్వ ఉంచే బాక్సులు లేదా గోడౌన్‌లలో కాల్షియం కార్బైడ్ కనిపిస్తే దాన్ని నేరానికి సంబంధించి ప్రత్యక్ష ఆధారంగా పరిగణించి FBOలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోడౌన్‌లు లేదా పండ్లను పండించే గదుల్లో అసిటిలీన్ వాయువును వాడుతున్నారా, లేదా గుర్తించేందుకు స్ట్రిప్ పేపర్ టెస్టులు చేయాలని అధికారులకు సూచనలు చేసింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






