Pineapple | ఈ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ పైనాపిల్ పండ్లను తినకూడదు
Pineapple | పైనాపిల్ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మ్యాంగనీస్, ఫైబర్, జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల పోషకాహార నిపుణులు ఈ పండ్లను సూపర్ ఫ్రూట్స్ గా పేర్కొంటారు.
Pineapple | పైనాపిల్ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మ్యాంగనీస్, ఫైబర్, జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల పోషకాహార నిపుణులు ఈ పండ్లను సూపర్ ఫ్రూట్స్ గా పేర్కొంటారు. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. వాపులను తగ్గిస్తాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ పండ్లు అందిస్తాయి. అయితే అనేక లాభాలను అందించినప్పటికీ కొందరు మాత్రం ఈ పండ్లను తినకూడదు. ఇవి కొందరికి సురక్షితం కావు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉన్నవారు పైనాపిల్ పండ్లను తినకూడదు.
అలర్జీలు..
అలర్జీలు ఉన్నవారు ఈ పండ్లను తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పండ్లలో బ్రోమెలైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. అయినప్పటికీ అలర్జీలు ఉన్నవారిలో ఈ ఎంజైమ్ కారణంగా కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు, ఆస్తమా, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక అలర్జీలు ఉన్నవారు తమ లక్షణాలకు అనుగుణంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ పండ్లను తినాల్సి ఉంటుంది. అలాగే ఆస్తమా ఉన్నవారు కూడా పైనాపిల్ తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
డయాబెటిస్, గుండె సమస్యలు..
డయాబెటిస్ ఉన్నవారు కూడా పైనాపిల్‌ను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా తీపిగా ఉంటుంది. దీని కారణంగా పైనాపిల్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. పైనాపిల్ జీఐ విలువ 66గా ఉంది. దీన్ని తింటే షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి. అలాగే హైబీపీ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినకూడదు. ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, పొటాషియం శరీరంలో కావల్సిన మోతాదు కన్నా అధిక మోతాదులో చేరితే గుండెకు మేలు జరగకపోగా హాని కలుగుతుంది. కనుక హైబీపీ ఉన్నవారు పైనాపిల్‌ను తినవచ్చు. కానీ తక్కువగా తినాల్సి ఉంటుంది.
నోరు, జీర్ణ సమస్యలు..
పైనాపిల్ పండ్లలో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ సహజంగానే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రమంలో పైనాపిల్ పండ్లను తింటే నోట్లో మండినట్లు అవుతుంది. నాలుక పగులుతుంది. అయితే ఇది వరకే నాలుకపై పగుళ్లు ఉన్నవారు ఈ పండ్లను తింటే సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక నాలుకపై పగుళ్లు ఉన్నవారు కూడా ఈ పండ్లను తినకూడదు. అలాగే పైనాపిల్ పండ్లలో అధికంగా ఉండే ఆమ్లత్వం కారణంగా సున్నితమైన దంతాలు లేదా చిగుళ్లు ఉన్నవారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. దీంతో దంతాల వద్ద చిగుళ్ల భాగాలు వాపులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండ్లను తినకూడదు. అలాగే గ్యాస్ట్రైటిస్, అల్సర్లు, అసిడిటీ, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండ్లకు దూరంగా ఉంటేనే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
సెప్టెంబర్ 10, 2026

Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు
సెప్టెంబర్ 10, 2026

Honey And Lemon Water | తేనె-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగితే ఏమవుతుంది ? నిజంగా ప్రయోజనాలున్నాయా ?
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు



