త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Blood Sugar Levels | షుగ‌ర్ ను త‌గ్గించే ఆహారాలు.. డైటిషియ‌న్లు చెబుతున్న సూచ‌న‌లు..

Blood Sugar Levels | ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య ఏటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అమెరికాలో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌రూపం దాలుస్తోంద‌ని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (CDC) చెబుతోంది. CDC గ‌ణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్ప‌టికే సుమారుగా 3.8 కోట్ల మందికి పైగా డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నార‌ని తేలింది.

S

Lifestyle | Published On Feb 2, 2026, 10.58 am IST

Blood Sugar Levels | షుగ‌ర్ ను త‌గ్గించే ఆహారాలు.. డైటిషియ‌న్లు చెబుతున్న సూచ‌న‌లు..
Advertisement

Blood Sugar Levels | ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య ఏటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అమెరికాలో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌రూపం దాలుస్తోంద‌ని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (CDC) చెబుతోంది. CDC గ‌ణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్ప‌టికే సుమారుగా 3.8 కోట్ల మందికి పైగా డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నార‌ని తేలింది. మ‌రో 9.6 కోట్ల మందికి ప్రీ డ‌యాబెటిస్ ఉంద‌ని తేల్చారు. అంటే రానున్న సంవ‌త్స‌రాల్లో దాదాపు స‌గం అమెరికా జ‌నాభా డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులుగా ఉంటార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇది అత్యంత ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే డ‌యాబెటిస్ రాకుండా ఉండాల‌న్నా, ఇప్ప‌టికే ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారు త‌మ చ‌క్కెర స్థాయిలను మరింత మెరుగు ప‌రుచుకోవాల‌న్నా అందుకు ఆహారం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని డైటిషియ‌న్లు చెబుతున్నారు.

బీన్స్‌, శ‌న‌గ‌లు..

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆహారం విష‌యంలో ప‌లు కీల‌క‌మార్పులు చేసుకుంటే ఈ వ్యాధిని నియంత్రించ‌వ‌చ్చ‌ని, అలాగే ప్రీ డ‌యాబెటిస్ ద‌శ‌లో ఉన్న‌వారు ఆ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చ‌ని, దీంతో మందుల‌ను వాడే బాధ త‌ప్పుతుంద‌ని డైటిషియ‌న్లు డ‌యానా లికాల్జి, జోస్ టెజెరో చెప్పారు. ఈ మేర‌కు వారు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు ద్వారా వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ క్ర‌మ‌బ‌ద్దంగా ఉండాలంటే అందుకు ఆహారం ఎంతో తోడ్ప‌డుతుంద‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు ఆహారాల‌ను రోజువారి డైట్‌లో చేర్చుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. బ్లాక్ బీన్స్‌, కిడ్నీ బీన్స్‌, శ‌న‌గ‌లు వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం ద్వారా వాటిల్లో ఉండే ఫైబర్‌, ప్లాంట్ ప్రోటీన్లు చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయని, దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని వారు తెలిపారు.

బ్రోక‌లీ..

బ్రోక‌లీలోని సల్ఫోరాఫేన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. క్రోమియం వంటి ఖనిజాలు శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించేందుకు తోడ్పడతాయి. కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో బ్రోక‌లీని తీసుకుంటే షుగ‌ర్ ఉన్న‌వారికి దోహ‌దం చేస్తుంది. దీన్ని రోజువారి డైట్‌లో భాగం చేసుకుంటే డ‌యాబెటిస్‌ను సుల‌భంగా నియంత్రించ‌వ‌చ్చు. అలాగే సోయాబీన్స్ లో ప్రోటీన్‌, ఫైబర్‌, ఐసోఫ్లేవోన్స్ సమృద్ధిగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. క‌నుక సోయాబీన్స్‌ను కూడా రోజూ తిన‌వ‌చ్చు.

బెర్రీలు, విత్త‌నాలు..

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీలు తీపిగా ఉన్నా చక్కెర తక్కువ. యాంటీఆక్సిడెంట్స్‌, యాంథోసైనిన్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. భోజనంతో పాటు తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ని వారు తెలిపారు. అదేవిధంగా చేప‌లు, గుమ్మ‌డికాయలు లేదా వాటి విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, చియా సీడ్స్ వంటి వాటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. వాటిల్లో ఉండే ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, ఇత‌ర స‌మ్మేళ‌నాలు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. దీని వ‌ల్ల డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.

Advertisement
Advertisement