CDSCO | జీఎల్‌పీ-1 మందులను అనధికారికంగా విక్రయిస్తే చర్యలు.. CDSCO హెచ్చరిక..
CDSCO | అధిక బరువును గణనీయంగా తగ్గించడంతోపాటు మధుమేహాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చే జీఎల్‌పీ-1 ఔషధాలకు దేశీయ జనరిక్ వెర్షన్ మందులు అందుబాటులోకి రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ మందులు అందరికీ సులభంగా అందుబాటులోకి రావడంతో వీటిని డాక్టర్ సూచన లేకుండా ప్రజలు వినియోగించే ప్రమాదం ఉందని భావించిన కేంద్రం చర్యలు చేపట్టింది.
CDSCO | అధిక బరువును గణనీయంగా తగ్గించడంతోపాటు మధుమేహాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చే జీఎల్‌పీ-1 ఔషధాలకు దేశీయ జనరిక్ వెర్షన్ మందులు అందుబాటులోకి రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ మందులు అందరికీ సులభంగా అందుబాటులోకి రావడంతో వీటిని డాక్టర్ సూచన లేకుండా ప్రజలు వినియోగించే ప్రమాదం ఉందని భావించిన కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మందులను అనధికారికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO ) హెచ్చరికలు జారీ చేసింది. సీడీఎస్‌సీవో ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల జీఎల్‌పీ-1 మందులను అనధికారికంగా విక్రయిస్తున్న ఫార్మసీ స్టోర్లు, వెల్‌నెస్ సెంటర్లు వంటి చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 49 సంస్థల్లో డ్రగ్స్ కంట్రోల్ నియంత్రణ అథారిటీ అధికారులు తనిఖీలు చేపట్టగా, నిబంధనలను ఉల్లంఘించిన పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. జీఎల్‌పీ-1 ఔషధాలను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికీ విక్రయించకూడదని, ప్రజలు కూడా డాక్టర్ సూచన లేకుండా వీటిని వాడొద్దని అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు.
ప్రచారంపైనా నిషేధం..
జీఎల్‌పీ-1 మందులు ఇప్పటి వరకు అత్యంత ఖరీదు కలిగి ఉండేవి. వీటి నెలవారి డోసు ధర రూ.10వేలకు పైనే ఉండేది. కానీ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి దేశీయ ఫార్మా కంపెనీలు జీఎల్‌పీ-1 ఔషధాలను ఇంజెక్షన్ల రూపంలో సెమాగ్లూటైడ్ డ్రగ్ ఫార్ములాతో ప్రవేశపెట్టారు. ఇవి విదేశీ జీఎల్‌పీ-1 ఔషధాల కన్నా 90 శాతం మేర ధర తక్కువగా కలిగా ఉన్నాయి. వీటి నెలవారి డోసుకు కేవలం రూ.2వేలే అవుతోంది. అందువల్ల ఈ ఔషధాలు అందరికీ అందుబాటులో ఉంటాయి కనుక ప్రజలందరూ వీటిని ఉపయోగించే అవకాశం ఉందని, ముఖ్యంగా డాక్టర్ సూచన లేకుండా వాడే ప్రమాదం ఉందని సీడీఎస్‌సీవో తెలిపింది. డాక్టర్ సలహా లేకుండా ఈ మందులను వాడితే తీవ్రమైన దుష్ర్పభావాలు ఎదురవుతాయని, ఆరోగ్య ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సీడీఎస్‌సీవో దేశవ్యాప్తంగా ఈ ఔషధాల అనధికార విక్రయాలపై కొరడా ఝులిపించింది. దేశవ్యాప్తంగా క్లినిక్‌లు, ఆన్‌లైన్ ఫార్మసీ ప్లాట్‌ఫామ్‌లు, హోల్ సేల్ వ్యాపారులు, వెల్ నెస్ క్లినిక్‌లపై దాడులు చేపట్టారు. ఇక జీఎల్‌పీ-1 ఔషధాల వినియోగంపై ప్రచారాన్ని కూడా నిషేధిస్తున్నామని, ఈ మందులతో ఎవరూ ప్రచారం చేయవద్దని కూడా సీడీఎస్‌సీవో ఆదేశాలు జారీ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
ఆగస్టు 12, 2026

Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
ఆగస్టు 12, 2026

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్‌పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల
- ●Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం
- ●Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
- ●Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?
- ●Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే

Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల

Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!

Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా



