త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Attack | గుండె పోటు వ‌చ్చిన స‌మ‌యంలో దీన్ని న‌మ‌లాలి.. కార్డియో స‌ర్జ‌న్ సూచ‌న‌..

Heart Attack | గుండెపోటు అనుమానం వచ్చిన వెంటనే తీసుకునే ఒక చిన్న చర్య ప్రాణాలను కాపాడగలదని అమెరికాకు చెందిన కార్డియోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తెలిపారు. త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియోలో ఆయన అత్యవసర సూచనలు చేశారు.

S

Lifestyle | Published On Jan 21, 2026, 10.21 am IST

Heart Attack | గుండె పోటు వ‌చ్చిన స‌మ‌యంలో దీన్ని న‌మ‌లాలి.. కార్డియో స‌ర్జ‌న్ సూచ‌న‌..
Advertisement

Heart Attack | గుండెపోటు అనుమానం వచ్చిన వెంటనే తీసుకునే ఒక చిన్న చర్య ప్రాణాలను కాపాడగలదని అమెరికాకు చెందిన కార్డియోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తెలిపారు. త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియోలో ఆయన అత్యవసర సూచనలు చేశారు. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ మాత్రను మింగకుండా నమలాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ఔషధం వేగంగా రక్తంలో కలిసిపోయి త్వరగా పనిచేస్తుందని వివరించారు. ఆస్పిరిన్ గుండెపోటును నేరుగా నయం చేయదని, కానీ రక్తంలో గడ్డలు (క్లాట్స్) ఏర్పడకుండా అడ్డుకుంటుందని డాక్టర్ లండన్ చెప్పారు. సాధారణంగా గుండెపోటు సమయంలో రక్తనాళంలో గడ్డ ఏర్పడి గుండె కండరాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఆస్పిరిన్ నమలడం వల్ల కొత్తగా మరిన్ని గడ్డలు ఏర్పడకుండా నివారించవచ్చని, దాంతో గుండెకు కలిగే నష్టం పరిమితం అవుతుందని ఆయన వివరించారు.

ఈ చర్య తీసుకునే సమయం చాలా కీలకమని డాక్టర్ లండన్ పేర్కొన్నారు. గుండెపోటు లక్షణాలు మొదలైన 1 నుంచి 4 గంటలలోపు ఆస్పిరిన్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ విధానం వల్ల తక్షణ కాలంలోనే కాకుండా దీర్ఘకాలంలో కూడా మరణ ప్రమాదం సుమారు 23 శాతం వరకు తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

అయితే అందరూ ఈ చర్య తీసుకోవడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. ఆస్పిరిన్‌కు అలర్జీ ఉన్నవారు, రక్తస్రావ సమస్యలు ఉన్నవారు లేదా వైద్యులు ఆస్పిరిన్ వాడవద్దని సూచించిన వారు మాత్రం దీన్ని తీసుకోకూడదని స్పష్టం చేశారు. మిగతా వారందరికీ మాత్రం ఇది ప్రాణాలను కాపాడే అత్యంత సులభమైన, ప్రభావవంతమైన చర్యగా ఉంటుంద‌ని అన్నారు. ఇక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో గుండె కండ‌రాల‌కు ర‌క్ష‌ణ అందించేందుకు ఆస్పిరిన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ఈ స‌మాచారాన్ని అంద‌రికీ షేర్ చేయాల‌ని ఆయ‌న కోరారు.

 

View this post on Instagram

 

A post shared by Jeremy London, MD (@drjeremylondon)

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం వైద్య విజ్ఞానం, అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. ఎవ‌రైనా త‌మ‌కు అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే వైద్య నిపుణుల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌ల‌హాల‌ను పాటించాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement