Jaggery | షుగర్ లెవల్స్ పెరగొద్దంటే.. బెల్లాన్ని ఇలా తినవచ్చు..!
Jaggery | తీపి తినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అలాంటి వారికి బెల్లం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇది కేవలం చక్కెరకు బదులు మాత్రమే కాదు, ఖనిజాలతో నిండినది, శరీరానికి నెమ్మదిగా శక్తిని అందించేది, రిఫైన్డ్ షుగర్ ఇవ్వలేని సహజమైన కారమెల్ లాంటి రుచిని ఇచ్చేదిగా ప్రసిద్ధి చెందింది.
Jaggery | తీపి తినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అలాంటి వారికి బెల్లం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇది కేవలం చక్కెరకు బదులు మాత్రమే కాదు, ఖనిజాలతో నిండినది, శరీరానికి నెమ్మదిగా శక్తిని అందించేది, రిఫైన్డ్ షుగర్ ఇవ్వలేని సహజమైన కారమెల్ లాంటి రుచిని ఇచ్చేదిగా ప్రసిద్ధి చెందింది. జర్నల్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో బెల్లం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం భారత్ అని వెల్లడైంది. ఇక్కడ బెల్లాన్ని ఘనరూపంలో, ద్రవరూపంలో, పొడి రూపంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది సంప్రదాయ ఆహారాల్లోనే కాదు, ఆయుర్వేద చికిత్సల్లో, పరిశ్రమలలో కూడా ఉపయోగపడుతోంది. బెల్లం శరీరానికి నిరంతర శక్తిని ఇస్తుంది, శరీరంలో ఐరన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
చింత పండు లేదా వెల్లుల్లి మిశ్రమంలో..
కొన్ని చిన్న మార్పులతో బెల్లాన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే తీపి సహజంగా ఉంటుంది, ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. టీ లో చిటికెడు బెల్లం వేస్తే తీపి మాత్రమే కాదు, ఓ అద్భుతమైన రుచి వస్తుంది. అల్లం, యాలకులతో కలిపితే జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. సాధారణ చక్కెరతో పోలిస్తే ఈ టీ మరింత సాంత్వనగా అనిపిస్తుంది. పచ్చి చట్నీ, చింతపండు చట్నీ లేదా వెల్లుల్లి మిశ్రమం.. వీటిలో కొద్దిగా బెల్లం కలిపితే రుచి సరిగ్గా ఉంటుంది. రుచి పెరగడంతోపాటు శక్తి కూడా నిరంతరాయంగా లభిస్తుంది. ఇక ఓట్స్, చిరు ధాన్యాల జావ, ఉప్మా లాంటి బ్రేక్‌ఫాస్ట్‌లలో చక్కెరకు బదులుగా కరిగించిన బెల్లం వాడండి. ఇది రుచితో పాటు ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలను అందించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పల్లీలు, కొబ్బరితో..
వేయించిన గింజలు, పల్లీలు, కొబ్బరితో బెల్లం కలిపి చేసుకునే ఇంటి స్నాక్స్ మధ్యాహ్నం ఆకలికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను పెంచవు. ఆకలిని నియంత్రిస్తాయి. అలాగే భోజనం తర్వాత జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. గుజరాతీ ఖట్టీ-మీటీ పప్పు వండితే అందులో కొద్దిగా బెల్లం వేస్తే మసాలాల తీవ్రత తగ్గి రుచి పెరుగుతుంది. మసాలా ఎక్కువగా ఉన్న భోజనాలను తిన్న తర్వాత పొట్టకి ఉపశమనం ఇస్తుంది. అట్టా బిస్కెట్లు, రాగి మఫిన్స్ వంటి ఇంట్లో చేసుకునే బేకింగ్‌లలో చక్కెర స్థానంలో బెల్లం వాడవచ్చు. ఇది తీపికి రుచిని ఇస్తుంది, కొంత పోషక విలువను కూడా అందిస్తుంది. బెల్లం అనేది తీపి మాత్రమే కాదు, అది సహజమైన, పోషకమైన, సమతుల్యమైన ఆహారంగా కూడా పనిచేస్తుంది. చిన్న మార్పులతో దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే తీపి కూడా లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



