త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HPV Vaccine | గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టేందుకు.. బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌..!

HPV Vaccine | కేంద్ర ప్రభుత్వం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అరికట్టేందుకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్‌ని దేశవ్యాప్తంగా అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల పైబడిన అమ్మాయిలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి.

P

Health | Published On Feb 25, 2026, 10.43 am IST

HPV Vaccine | గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టేందుకు.. బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌..!
Advertisement

HPV Vaccine | కేంద్ర ప్రభుత్వం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అరికట్టేందుకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్‌ని దేశవ్యాప్తంగా అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల పైబడిన అమ్మాయిలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా గార్డాసిల్ (Gardasil) టీకా ఇవ్వనున్నారు. ఈ ఇంజెక్షన్‌తో నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌లకు రక్షణ అందిస్తుంది. ముఖ్యంగా హెచ్‌పీవీ టైప్ 16, 18తో పాటు 6, 11 రకాల వైరస్‌ల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

14 ఏళ్ల లోపు బాలికలకు రెండు డోసులు, 15 ఏళ్ల పైబడిన వారికి మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే గార్డాసిల్-4 ఒక్కో డోసు సుమారు రూ3,927 ధర ఉంది. అయితే, కేంద్రం పూర్తిగా అందించనున్నదని అధికారులు పేర్కొన్నారు. ఒకే డోసు తీసుకున్నప్పటికీ దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. 2006 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ 50 కోట్లకుపైగా డోసులు అందించారు. అనేక దేశాల్లో టీకా కారనంగా గర్భాశయ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతానికి 160 దేశాల్లో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం అమలులో ఉంది. ఇందులో 90 దేశాలు సింగిల్ డోసు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన క్యాన్సర్ కేసుల్లో భారత్‌, చైనా, అమెరికా తర్వాత మూడోస్థానంలో ఉంది. 2040 నాటికి భారత్‌లో క్యాన్సర్ కేసులు ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. సంవత్సరానికి సుమారు 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో దాదాపు 15 లక్షల కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. ఈ వ్యాక్సిన్ జాతీయ స్థాయిలో అమలులోకి రావడం ద్వారా, గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనలో దేశానికి పెద్ద అడుగు ముందుకు వేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement