త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tea | హెర్బ‌ల్ టీల‌లో టీ అనే ప‌దాన్ని వాడొద్దు.. FSSAI ఆదేశాలు..

Tea | ప్ర‌స్తుతం చాలా మంది హెర్బ‌ల్ టీల‌ను సేవిస్తున్న విష‌యం విదిత‌మే. మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ర‌కాల మొక్క‌ల‌కు చెందిన ఆకులు, పువ్వులు, బెర‌డు, పొడి వంటి వాటితో ఆయా హెర్బ‌ల్ టీల‌ను త‌యారు చేస్తారు.

S

Health | Published On Dec 27, 2025, 12.18 pm IST

Tea | హెర్బ‌ల్ టీల‌లో టీ అనే ప‌దాన్ని వాడొద్దు.. FSSAI ఆదేశాలు..
Advertisement

Tea | ప్ర‌స్తుతం చాలా మంది హెర్బ‌ల్ టీల‌ను సేవిస్తున్న విష‌యం విదిత‌మే. మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ర‌కాల మొక్క‌ల‌కు చెందిన ఆకులు, పువ్వులు, బెర‌డు, పొడి వంటి వాటితో ఆయా హెర్బ‌ల్ టీల‌ను త‌యారు చేస్తారు. అయితే ఆయా ప‌దార్థాల‌తో త‌యారు చేసే పానీయాల‌ను అస‌లు టీ అన‌లేమ‌ని, కేవ‌లం Camellia sinensis అనే మొక్క ఆకులతో త‌యారు చేసే పానీయాల‌నే టీ అంటామ‌ని, క‌నుక వివిధ ర‌కాల హెర్బ‌ల్ టీల‌ను త‌యారు చేసి విక్ర‌యించే వారు వాటిని టీ గా పేర్కొన‌వ‌ద్ద‌ని FSSAI ఆదేశాలు జారీ చేసింది. టీ అంటే కేవ‌లం Camellia sinensis అనే మొక్క ఆకుల‌తో త‌యారు చేసిన పానీయాన్నే టీ గా భావించాల‌ని FSSAI తెలియ‌జేసింది.

వివిధ ర‌కాల వృక్ష సంబంధ ప‌దార్థాల‌తో చాలా మంది హెర్బ‌ల్ టీల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు. అయితే వాటిల్లో Camellia sinensis అనే మొక్క ఆకులు ఉండ‌వు. క‌నుక ఆయా హెర్బ‌ల్ టీల‌ను టీగా పేర్కొన‌డం కుద‌ర‌దు. ఫుడ్ బిజినెస్ ఆప‌రేట‌ర్లు (ఎఫ్‌బీవో) ఈ విష‌యంపై క‌చ్చితంగా నియ‌మ నిబంధ‌న‌లను పాటించాలి. త‌మ హెర్బ‌ల్ టీ లేబుల్స్‌ను టీ గా పేర్కొన‌కూడ‌దు. వాటిని కేవ‌లం ఇన్‌ఫ్యూజ్డ్ పానీయాలుగా పేర్కొనాల‌ని, టీగా చెప్ప‌కూడ‌ద‌ని, అలా చేయ‌క‌పోతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ 2006 చ‌ట్టాన్ని ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని, అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని FSSAI తెలియ‌జేసింది.

కాగా Camellia sinensis అనే మొక్క ఆకుల‌తోనే మ‌నం రోజూ తాగే సాధార‌ణ టీ పొడిని త‌యారు చేస్తారు. ఈ ఆకుల‌నే గ్రీన్ టీ త‌యారీకి ఉప‌యోగిస్తారు. అయితే ఆ ఆకుల‌ను ప్రాసెస్ చేసే విధానం వేరేగా ఉంటుంది. క‌నుక‌నే సాధార‌ణ టీ పొడి, గ్రీన్ టీ పొడి రెడీ అవుతాయి. ఈ క్ర‌మంలోనే కేవ‌లం ఆ మొక్క ఆకుల‌ను ఉప‌యోగించి త‌యారు చేసే పొడినే టీ పొడిగా పేర్కొనాల్సి ఉంటుంది. అదే అస‌లైన టీ కింద‌కు వ‌స్తుంది. కానీ వివిధ ర‌కాల వృక్ష సంబంధ ప‌దార్థాల‌తో టీ పొడిలా త‌యారు చేసి విక్ర‌యిస్తే దాన్ని టీ అని చెప్ప‌కూడ‌దు. కేవ‌లం హెర్బ‌ల్ డ్రింక్‌గా చెప్పాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే FSSAI తాజాగా ఈ ఆదేశాల‌ను ఫుడ్ బిజినెస్ ఆప‌రేట‌ర్ల‌కు జారీ చేసింది. క‌నుక వారు ఇక‌పై ఆయా పొడుల‌ను హెర్బ‌ల్ టీ పొడులుగా చెప్పి విక్ర‌యించ‌కూడ‌దు. కేవ‌లం హెర్బ‌ల్ డ్రింక్స్ గా మాత్ర‌మే విక్ర‌యించాల్సి ఉంటుంది. టీ అనే ప‌దాన్ని వాడ‌కూడ‌దు. ఆ మేర‌కు లేబుల్స్‌ను మార్చాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement