Eggs | కోడిగుడ్లను తింటే క్యాన్సర్ రాదు.. స్పష్టం చేసిన FSSAI..
Eggs | సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో చాలా వరకు వార్తలు తప్పుగానే ప్రచారం అవుతున్నాయి. కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
Eggs | సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో చాలా వరకు వార్తలు తప్పుగానే ప్రచారం అవుతున్నాయి. కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కోడిగుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేశారు. అనేక మీడియా సంస్థలు సైతం ఈ విషయాన్ని నిజమే అని నమ్మాయి. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే వార్త అని, ప్రజలను ఆందోళనకు గురి చేసేందుకు ఇలా ప్రచారం చేశారని FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ మేరకు FSSAI ఒక ప్రకటనను విడుదల చేసింది. కోడిగుడ్లను తినడం వల్ల క్యాన్సర్ రాదని, అది తప్పుడు వార్త అని తెలియజేసింది.
కోళ్ల ఫామ్‌లలో గుడ్లను ఉత్పత్తి చేసేందుకు గాను నైట్రోఫ్యూరాన్ మెటాబోలైట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, ఇవి గుడ్లలోనూ అధిక మొత్తంలో ఉంటున్నాయని, ఇవి క్యాన్సర్‌ను కలగజేస్తాయని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేశారని FSSAI తెలియజేసింది. అయితే కోడిగుడ్ల ఉత్పత్తికి గాను నైట్రోఫ్యూరాన్స్‌ను వాడడం 2011 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నియమాల ప్రకారం చట్ట విరుద్ధమని, కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కోడిగుడ్లలో అలాంటి సమ్మేళనాల అవశేషాలు అధికంగా ఉన్నట్లు ఎక్కడా స్పష్టం కాలేదని, కనుక కోడిగుడ్లను ప్రతి ఒక్కరు నిర్భయంగా తినవచ్చని FSSAI తెలిపింది. నైట్రోఫ్యూరాన్స్ క్యాన్సర్‌కు కారణం అవుతాయని ఎక్కడా ఎవరూ ఏ రిసెర్చిలోనూ వెల్లడించలేదని కూడా FSSAI పేర్కొంది. నైట్రోఫ్యూరాన్స్‌కు, కోడిగుడ్లను తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు అసలు సంబంధం లేదని కూడా FSSAI స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కోడిగుడ్ల ఉత్పత్తికి పాటించే ప్రమాణాలనే ఇండియా కూడా పాటిస్తుందని FSSAI తెలిపింది. కోడిగుడ్లలో నైట్రోఫ్యూరాన్స్ తాలూకు అవశేషాలు దాదాపుగా ఉండవని, ఉన్నా చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయని, వాటి వల్ల మనకు ఎలాంటి ముప్పు ఉండదని FSSAI తెలిపింది. భారత్‌లో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లలో పరిమితికి లోబడే మెటాబోలైట్స్ ఉంటున్నాయని తెలిపింది. దీని వల్ల ప్రజలకు ఎలాంటి హాని కలగదని, అందువల్ల కోడిగుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని అనడంలో నిజం లేదని స్పష్టం చేసింది. కనుక ప్రజలు దీని పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ఇలాంటి వార్తలను నమ్మవద్దని, కేవలం శాస్త్రీయంగా అన్ని ఆధారాలతో చెప్పే నిజాలనే నమ్మాలని కోరింది.
సంబంధిత వార్తలు

REDMOD | వైద్య నిపుణులకు సైతం సాధ్యం కాలేదు.. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తున్న ఏఐ..
మే 2, 2026

Dragon Fruit Farming | డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న క్యాన్సర్ పేషెంట్
మే 1, 2026

Food Poisoning | ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా..? వైద్యులు ఏమంటున్నారు..?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



