త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2026లో జ‌ర‌గ‌నున్న సంఘ‌ట‌న‌లు ఇవే.. బాబా వంగా అప్ప‌ట్లో ఏం చెప్పిందంటే..?

S

Lifestyle | Published On Dec 8, 2025, 7.48 pm IST

2026లో జ‌ర‌గ‌నున్న సంఘ‌ట‌న‌లు ఇవే.. బాబా వంగా అప్ప‌ట్లో ఏం చెప్పిందంటే..?
Advertisement

ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ముగింపున‌కు వ‌చ్చింది. మ‌రి కొద్ది రోజుల్లో నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చాలా మంది ఈ సారి డిసెంబ‌ర్ 31వ తేదీన న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఎలా జ‌రుపుకోవాలి అని ఇప్ప‌టి నుంచే ప్లాన్లు వేస్తుండ‌గా, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ‌లు కూడా ఇందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం చాలా మంది ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 2025లో వాస్త‌వానికి ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. దీంతో ఈ సంవ‌త్స‌రం ఎప్పుడు అయిపోతుందా, కొత్త సంవ‌త్స‌రం ఎప్పుడు వ‌స్తుందా అని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే 2026లో అయినా అంతా బాగుండాల‌ని, అంద‌రికీ మంచే జ‌ర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. కానీ ప్ర‌ముఖ కాల‌జ్ఞాని బాబా వంగా చెప్పిన ప్ర‌కారం 2026 ప‌లు తీవ్ర సంక్షోభాలు, యుద్ధాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

బాబా వంగా బ‌ల్గేరియాకు చెందిన కాలజ్ఞాని. ఆమె 1911లో జ‌న్మించింది. 1996లో 86 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్ను మూసింది. అయితే ఆమెకు 12 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు దుర‌దృష్ట‌వ‌శాత్తూ చూపు కోల్పోయింది. కానీ ఆమెకు భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఊహించి చెప్పే జ్ఞానం ల‌భించింద‌ని చెబుతారు. అందుకు అనుగుణంగానే ఆమె చెప్పిన‌ట్లు కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం కూడా విశేషం. ఆమె చెప్పిన‌ట్లుగానే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఆమె సోవియ‌ట్ యూనియ‌న్ లో చీలిక వ‌స్తుంద‌ని, అమెరికాలో సెప్టెంబ‌ర్ 11 దాడులు జ‌రుగుతాయ‌ని ముందే ఊహించి చెప్పింది. దీంతో అవి అలాగే జ‌రిగాయి. ఇలా ఆమె ఎన్నో సంఘ‌ట‌న‌ల గురించి ముందుగానే చెప్ప‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే 2026లోనూ ప‌లు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయని ఆమె అప్ప‌ట్లో చెప్పింది.

బాబా వంగా చెప్పిన ప్ర‌కారం 2026లో ఓ ప్ర‌ధాన యుద్ధం రానుంది. దీని వ‌ల్ల ప‌శ్చిమాన ఉన్న చాలా వ‌ర‌కు దేశాలు నాశ‌నం అవుతాయ‌ని తెలియ‌జేసింది. అలాగే ర‌ష్యా నుంచి ఒక కొత్త నాయకుడు పుట్టుకు వ‌స్తాడ‌ని, అత‌ను ప్ర‌పంచ దేశాల‌పై త‌న ప్ర‌భావాన్ని చూపిస్తాడ‌ని కూడా ఆమె తెలియ‌జేసింది. అత‌న్ని ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌లంద‌రూ లార్డ్ ఆఫ్ ది వ‌ర‌ల్డ్ గా పిలుస్తార‌ని చెప్పింది. ఇక బాబా వంగా చెప్పిన ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 2026లో రాజ‌కీయంగా అనేక దేశాల్లో పెను మార్పులు సంభ‌విస్తాయి. దీని కార‌ణంగా చాలా దేశాల‌లో ప్ర‌జ‌ల్లో అనిశ్చితి నెల‌కొంటుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్ర‌కృతి ఉత్పాతాలు కూడా సంభ‌విస్తాయి. ఇక 2026 న‌వంబ‌ర్ నెల‌లో భూమిపై ఉన్న ప్ర‌జ‌లు ఏలియ‌న్స్‌తో మొద‌టిసారిగా కాంటాక్ట్ అవుతార‌ని కూడా ఆమె చెప్పింది. అయితే ఆమెను న‌మ్మే చాలా మంది ఫాలోవ‌ర్లు మాత్ర‌మే ఇవ‌న్నీ నిజ‌మే అని, నిజంగానే జ‌రుగుతాయ‌ని అంటుండ‌గా, సైంటిస్టులు మాత్రం కొట్టి పారేస్తున్నారు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement