త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Doomsday Predictions | 2026లో ప్రపంచం అంతం కాబోతుందా? బాబా వంగా అంచనాలు నిజం కానున్నాయా?

2026లో ప్రపంచం అంతం అవుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బాబా వంగా, నోస్ట్రడామస్ వంటి వారి పేరిట వినిపిస్తున్న ఈ వింత అంచనాల వెనుక ఉన్న అసలు నిజమేంటి?

J

Science | Published On Jan 12, 2026, 5.01 pm IST

Doomsday Predictions | 2026లో ప్రపంచం అంతం కాబోతుందా? బాబా వంగా అంచనాలు నిజం కానున్నాయా?

సంక్షిప్త సారాంశం

మూడో ప్రపంచ యుద్ధం, గ్రహాంతరవాసుల రాక, ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా 2026 గురించి భయంకరమైన జోస్యాలు వినిపిస్తున్నాయి. డూమ్స్ డే భయంతో ప్రపంచదేశాలను సోషల్ మీడియా వణికిస్తోంది. బాబా వంగా, అథోస్ సలోమ్ లాంటి వాళ్లు 2026 లో విపత్తులు తప్పవని ముందే ఊహించారు. అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనా లేక ఇందులో ఏదైనా వాస్తవం ఉందా అనే కోణంలో విశ్లేషణాత్మక కథనం మీకోసం.

Advertisement

Doomsday Predictions | సబ్ ఖతం, టాటా, బైబై.. ఇవే ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్‌గా తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2026 సంవత్సరం ప్రారంభం అయి 10 రోజులు అయిందో లేదో అప్పుడే ప్రపంచం అంతం కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో భయాందోళన కలిగించే పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వంగా లాంటి ప్రముఖ భవిష్యత్తు ఊహకర్త, ఆధ్యాత్మిక వేత్త అంచనాల పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం ఎంతో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

బల్గేరియాకు చెందిన బాబా వంగా 2026 ప్రారంభం కాగానే ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవేంటి అంటే.. ఒకటి మూడో ప్రపంచ యుద్ధం, ఇంకోటి గ్రహాంతర వాసులు భూమ్మీదికి రావడం, ప్రకృతి వైపరీత్యాలు, ఏఐ ఆధిపత్యం. వీటి వల్ల ప్రపంచం అంతం కాబోతోందనేది సారాంశం.

బాబా వంగాకు వంత పాడుతున్న అథోస్ సలోమ్

బాబా వంగా మాత్రమే కాదు.. బ్రెజిల్‌కి చెందిన 'లివింగ్ నోస్ట్రడామస్' అథోస్ సాలోమ్, ఇతర ఆధ్యాత్మిక గురువులు కూడా 2026లో విపత్తులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

పుకార్ల వ్యాప్తికి కారణాలేంటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులే ఈ పుకార్లకు ప్రధాన కారణం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇరాన్ నిరసనలు, వెనిజులా సంక్షోభం, పెరుగుతున్న ఆర్థిక మాంద్యం వంటి అంశాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

నిజంగానే 2026 చివరి సంవత్సరమా?

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ఇలాంటి 'డూమ్స్ డే' (Doomsday) అంచనాలు చాలాసార్లు విఫలమయ్యాయి.

Y2K (2000): కంప్యూటర్లు ఆగిపోయి ప్రపంచం అతలాకుతలం అవుతుందన్నారు, కానీ ఏమీ కాలేదు.

2012 మాయన్ క్యాలెండర్: మాయన్ కాలమానం ముగిసిపోయిందని, 2012లో ప్రపంచం అంతమవుతుందని ప్రచారం చేశారు. కానీ మనం ఇప్పటికీ బతికే ఉన్నాం.

నిజానికి బాబా వంగా తన అంచనాల్లో ప్రపంచం 5079వ సంవత్సరంలో అంతమవుతుందని చెప్పినట్లు రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు కేవలం పాత అంచనాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి సృష్టించినవే తప్ప, అధికారికమైనవి కావు.

భయం వద్దు.. అవగాహన ముఖ్యం

2026లో రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఉండవచ్చు కానీ, ప్రపంచం మొత్తం అంతమైపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని.. ఈ ఏడాది చివర్లో (డిసెంబర్ 18) రాబోతున్న 'ఎవెంజర్స్: డూమ్స్ డే' (Avengers: Doomsday) సినిమా మినహా, వేరే ఏ 'డూమ్స్ డే' వచ్చే అవకాశం లేదని తత్వవేత్తలు భరోసా ఇస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ఆందోళన చెందకుండా, వాస్తవాలను గుర్తించడం ముఖ్యమని సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement