Nobel Prize | ట్రంప్‌కు నోబెల్ పురస్కారం.. అందజేసిన వెనెజులా విపక్ష నేత మచాడో
Nobel Prize | వెనెజులా (Venezuela) విపక్ష నేత, దేశంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2025 నోబెల్ బహుమతిని (Nobel Prize) గెలుచుకున్న మరియా కొరినా మచాడో (Mara Corina Machado) అన్నంత పనీ చేశారు. తనకు బహూకరించిన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) అందజేశారు.
International | Published On Jan 16, 2026, 6.58 am IST
త్రినేత్ర.న్యూస్: వెనెజులా (Venezuela) విపక్ష నేత, దేశంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2025 నోబెల్ బహుమతిని (Nobel Prize) గెలుచుకున్న మరియా కొరినా మచాడో (Mara Corina Machado) అన్నంత పనీ చేశారు. తనకు బహూకరించిన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) అందజేశారు. తమ దేశ సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇచ్చినట్లు తెలిపారు. అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు ఈ నెల 3న బంధించిన విషయం తెలిసిందే. దీంతో తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్‌కు అంకితం ఇస్తున్నట్లు ఈ నెల 6న ప్రకటించారు. నోబెల్ గౌరవాన్ని ట్రంప్ పంచుకునేందుకు లేదా పూర్తిగా ఆయనకే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కాగా, గత నెలలో నోబెల్ పురస్కారాన్ని అందుకునేందుకు అమెరికా బలగాల సహాయంతో నార్వే వెళ్లిన మచాడో, తిరిగి వెనిజులాకు వెళ్లలేదు. అయితే గురువారం ఒక్కసారిగా ఆమె అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. సుమారు గంటకుపైగా ట్రంప్‌తో సాగిన ఈ భేటీలో వెనెజులా రాజకీయ భవిష్యత్ గురించి ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం వైట్‌హౌస్ నుంచి బయటకు వస్తూ మద్దతుదారులకు అభివాదం చేశారు. తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్‌పై ఆధారపడొచ్చని మచాడో పేర్కొన్నారు. థ్యాంక్యూ ట్రంప్ అంటూ నినదించారు. అయితే తన నోబెల్ బహుమతిని తీసుకోవడానికి ట్రంప్ అంగీకరించారో లేదో ఆమె వెల్లడించలేదు.
కాగా, మధురో అరెస్టు అనంతరం మెనెజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో మచాడో కీలకపాత్ర పోషిస్తారని అంతా అనుకున్నారు. అయితే ట్రంప్ మాత్రం దేశంలో ఆమెకు తగినంత మద్దతు లేదని వ్యాఖ్యానించారు. ఆమె చాలా మంచి మనిషి అని, కానీ దేశంలో ఆమెకు ఆదరణ లేదన్నారు. ఆమె దేశానికి నాయకత్వం వహించడం కష్టమని భావిస్తున్నట్లు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్యయనం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్
అక్టోబర్ 5, 2026

Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
అక్టోబర్ 1, 2026

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న 'మహాలక్ష్మి': 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం
- ●RBI | ఆర్బీఐ కీలక ప్రకటన.. ఫ్లోటింగ్ రేట్ బాండ్‌పై 6.45 శాతం వడ్డీ.. ఎంత వస్తుంది..?
- ●Komatireddy Venkat Reddy | మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకరించండి
- ●Pujita Ponnada | రంగస్థలం బ్యూటీ హారర్ మూవీ - రాజభవనంలో నర్తకిగా ...
- ●Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా..బిల్లుపై 10 శాతం భరించాల్సిందే..?
- ●Rajya Sabha polls | రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. సిట్టింగులకు షాక్

TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న 'మహాలక్ష్మి': 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం

RBI | ఆర్బీఐ కీలక ప్రకటన.. ఫ్లోటింగ్ రేట్ బాండ్‌పై 6.45 శాతం వడ్డీ.. ఎంత వస్తుంది..?

Komatireddy Venkat Reddy | మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకరించండి

Pujita Ponnada | రంగస్థలం బ్యూటీ హారర్ మూవీ - రాజభవనంలో నర్తకిగా ...



