Donald Trump | ఇరాన్ చర్చలకు వస్తే.. ఇప్పటికే ఆలస్యమైందని చెప్పా : ట్రంప్
Donald Trump | మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని, కీలక రక్షణా సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇరాన్ చర్చలకు ముందుకు వచ్చిందని.. ఇది సరైన సమయం కాదని, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని వ్యాఖ్యానించారు.
International | Published On Mar 3, 2026, 8.13 pm IST
Donald Trump | మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని, కీలక రక్షణా సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇరాన్ చర్చలకు ముందుకు వచ్చిందని.. ఇది సరైన సమయం కాదని, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని వ్యాఖ్యానించారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసంపై ఆయన స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ నాయకత్వాన్ని తుదముట్టించాం. చర్చలు జరపాలని ఇప్పుడు కోరుతున్నారు. కానీ, నేను ‘చాలా ఆలస్యమైంది’ అని చెప్పాను” అని ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధాలు అపారంగా ఉన్నాయని, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తప్పుదారి పట్టించేలా, అవమానకరంగా ఉందన్నారు. వరుసగా నాలుగోరోజు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. దాడులు ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరాన్‌లోని ప్రెసిడెంట్ బిల్డింగ్ కాంప్లెక్స్, అత్యున్నత భద్రతా మండలికి సంబంధించిన భవనంపై తన వైమానిక దళం దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్ దాడులు చేపట్టింది. శనివారం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణ ప్రస్తుతం సరిహద్దు దాటి పరస్పర దాడులుగా విస్తరించాయి.
సోమవారం వైట్ హౌస్‌లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్‌పై యుద్ధ ప్రణాళిక తొలుత “నాలుగు నుంచి ఐదు వారాలపాటు” కొనసాగుతుందని అంచనా వేశామని తెలిపారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ కాలం కొనసాగించే సామర్థ్యం అమెరికా సైన్యానికి ఉందని చెప్పారు. ఇరాన్ నుంచి అమెరికా ప్రయోజనాలకు “తీవ్ర ముప్పు” ఉన్నందునే ఇజ్రాయెల్‌తో కలిసి చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరో సోషల్ మీడియా పోస్టులో దీర్ఘకాలిక యుద్ధాలను కొనసాగించేందుకు తగినంత ఆయుధ నిల్వలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అపరిమితమైన మందుగుండు సామగ్రి సిద్ధంగా ఉందని, భారీ విజయానికి సిద్ధంగా ఉందంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. గత ఏడాది రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్, ఎన్నికల ప్రచారంలో యుద్ధాలకు దూరంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్థిక అంశాలకే ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ఇరాక్, అఫ్గానిస్తాన్ విషయాల్లో అమెరికా జోక్యంపై గతంలో విమర్శలు చేసిన ట్రంప్.. ఇరాన్‌పై దాడికి ఆదేశాలివ్వడం గమనార్హం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






