US-Israel-Iran War | స్టాక్ మార్కెట్లను తప్పుదోవ పట్టించేందుకే ట్రంప్ ఫేక్ న్యూస్ ప్రచారం : ఇరాన్
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం 25వ రోజుకు చేరుకోగా.. టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అటు ట్రంప్ ఇంధన కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
International | Published On Mar 24, 2026, 5.17 pm IST
ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్
అమెరికాతో ఎలాంటి చర్చలు జరుగలేదు
టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
నిఘా కేంద్రాలపై ఇజ్రాయెల్ గురి
పెంటగాన్ చీఫ్ ఇచ్చిన సలహానే యుద్ధానికి కారణమన్న ట్రంప్
US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధం మరింత భీకర రూపం దాల్చుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఇతర సీనియర్ కమాండర్ల హత్యతో మొదలైన అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేటికి 25వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఒకపక్క శాంతి చర్చల పేరిట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం
మంగళవారం ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌పైకి భారీ ఎత్తున క్షిపణులను ప్రయోగించాయి. ఈ దాడులతో నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. పలు బహుళ అంతస్తుల భవనాలకు భారీగా నష్టం వాటిల్లగా, రోడ్లపై వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఐఆర్‌జీసీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకారం
ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు టెహ్రాన్‌పై విరుచుకుపడ్డాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిఘా విభాగానికి చెందిన కీలక కమాండ్ కేంద్రాలు, ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. బాలిస్టిక్ క్షిపణి నిల్వ, ప్రయోగ కేంద్రాలతో సహా రాత్రికి రాత్రే దాదాపు 50కి పైగా లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
దాడుల నిలిపివేత.. హార్ముజ్ జలసంధిపై ట్రంప్ షరతులు
ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం వాటా ఉన్న 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్నది. ఆ జలసంధిని వెంటనే తెరవాలని ట్రంప్ ఇరాన్‌ను డిమాండ్ చేశారు. దానికి ప్రతిఫలంగా ఇరాన్ విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అయినప్పటికీ, ట్రంప్ ప్రకటనకు ఒక్కరోజు ముందే సెంట్రల్ ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లోని గ్యాస్ సదుపాయాలు, ఖొర్రంషహర్ పవర్ ప్లాంట్ గ్యాస్ పైప్‌లైన్‌లపై ఇజ్రాయెల్-అమెరికా దాడులు జరిగాయని ఇరాన్ మీడియా తెలిపింది.

చర్చలన్నీ ఫేక్ న్యూస్: ఇరాన్
అమెరికా ప్రతినిధులు, ఇరాన్ నాయకులతో "అత్యంత గౌరవప్రదమైన" చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్ ఇరాన్ అధికారులతో ఈ వారంలో సమావేశం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ స్పష్టం చేశారు. మార్కెట్లను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించడానికే ట్రంప్ ఇలాంటి 'ఫేక్ న్యూస్' ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు, ఈ యుద్ధానికి పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ ఇచ్చిన సలహాయే కారణమని ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం.. భారతీయుల భద్రతపై మోదీ భరోసా
ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరింది. చమురు ధరల ప్రభావంతో భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 93.94కి పడిపోయింది. మిడిల్ ఈస్ట్‌లో డ్రోన్ దాడుల కారణంగా బహ్రెయిన్‌లోని అమెజాన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇరాన్‌లో 1,443 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 16 మంది మరణించినట్లు అంచనా. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య పశ్చిమ ఆసియాలో ఉన్న భారతీయుల భద్రతకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. అక్కడ నివసిస్తున్న భారతీయులందరినీ సురక్షితంగా కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Strait of Hormuz | ఇరాన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: హార్ముజ్ జలసంధి ఓపెనింగ్‌పై వీడని సస్పెన్స్
మే 2, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

US-Israel-Iran War | యూఎస్, ఇరాన్ చర్చలపై నో క్లారిటీ.. యుద్ధం ముగుస్తుందా? లేదా?
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



