Iran-US Conflict | దోహాలో కీలక చర్చలు.. ఇరాన్ ఎయిర్ బేస్‌పై అమెరికా దాడి..
Iran-US Conflict | పశ్చిమాసియాలో జరుగుతున్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఓ వైపు దోహాలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మళ్లీ ఇరాన్, లెబనాన్‌పై దాడులకు తెగబడ్డాయి. సౌత్ ఇరాన్‌లోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ ఆర్మీ బేస్‌పై అమెరికా సైన్యం దాడులు చేసింది.
International | Published On May 26, 2026, 6.22 am IST
Iran-US Conflict | పశ్చిమాసియాలో జరుగుతున్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఓ వైపు దోహాలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మళ్లీ ఇరాన్, లెబనాన్‌పై దాడులకు తెగబడ్డాయి. సౌత్ ఇరాన్‌లోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ ఆర్మీ బేస్‌పై అమెరికా సైన్యం దాడులు చేసింది. అయితే, దాడులను ఆత్మరక్షణ దాడులుగా అమెరికా అభివర్ణించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ప్రకారం.. ఈ ఆపరేషన్ క్షిపణి ప్రయోగ స్థావరాలను, జలమార్గంలో మందుపాతరలను అమర్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ ఇరాన్ నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ చమురు సరఫరాలలో ఎక్కువశాతం ప్రతిరోజూ ఈ జలమార్గం గుండానే వెళ్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ దళాల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి అమెరికా సైనికులను కాపాడుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు హాకిన్స్ పేర్కొన్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన రెండు పడవలు హోర్ముజ్ జలసంధిలో నేవి మందుపాతరలను ఏర్పాటు చేస్తూ చిక్కాయని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
అమెరికా దళాలు రెండు నౌకలను ధ్వంసం చేశాయని, అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో బందర్ అబ్బాస్‌లోని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మిస్సైల్ స్థావరంపై దాడి చేశాయని సమాచారం. ఈ దాడులను రక్షణాత్మకమైనవిగా యూఎస్ వర్గాలు అభివర్ణించాయి. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కొనసాగుతున్న చర్చలు విఫలమయ్యాయడానికి ఇది ఉదాహారణగా పేర్కొంటున్నారు. ఈ ఆపరేషన్ కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు కొన్ని ఇరాన్ మీడియా సంస్థలు కూడా నివేదించాయి. అదే సమయంలో సౌత్ లెబనాన్ ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ మద్దతు ఉన్న ఈ మిలిటెంట్ గ్రూప్‌ను అణచివేసే ప్రయత్నంలో భాగంగా సైనిక చర్యలను వేగవంతం చేయాలని ఆర్మీని ఆదేశించినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 17న అధికారికంగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. ఉద్రికత్తలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాదాపు ప్రతిరోజూ కాల్పులు కొనసాగుతూ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. తాజా సైనిక పరిణామాలపై ఇరాన్ గానీ, ఖతార్ మధ్యవర్తులు గానీ అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి సహా ఇరాన్ ఉన్నతాధికారులు, ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత కీలకమైన చర్చల్లో ఒకటిగా అభివర్ణించిన సమావేశం కోసం దోహాలో ఉన్నారు. చర్చల సమయంలో టెహ్రాన్ ప్రధాన డిమాండ్లలో ఒకటైన, స్తంభింపజేసిన ఇరాన్ విదేశీ ఆస్తుల విషయంలో, ఖతార్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్, టెహ్రాన్ ఇప్పటికే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రధాన ప్రతిష్టంభన అంశమైన ఇరాన్ సుసంపన్న యురేనియం నిల్వలపై ఒక పురోగతికి అవకాశం ఉందని సూచించారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ట్రంప్ మాట్లాడుతూ తాను ‘అణు ధూళి!’గా అభివర్ణించిన సుసంపన్న యురేనియాన్ని నాశనం చేసేందుకు అమెరికాకు అప్పగించవచ్చని, అంతర్జాతీయ పర్యవేక్షణలో ఇరాన్‌లోనే విచ్ఛిన్నం చేయవచ్చని పేర్కొన్నారు. తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ మళ్లీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
Airstrike on Iran.
American fighter jets have reportedly destroyed Iranian airbases.
More than 200 missile attacks have been carried out on Iran so far. pic.twitter.com/QUBlChFuWM
— America Army (@AmericaSpoof) May 25, 2026
సంబంధిత వార్తలు

Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు
జులై 12, 2026

Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
జులై 11, 2026

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
జులై 10, 2026
తాజావార్తలు
- ●CM Chandrababu | పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు
- ●Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
- ●Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం
- ●Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు
- ●Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు
- ●Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట

CM Chandrababu | పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు

Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం

Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు



