త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

చెకప్ పేరుతో మహిళా పేషెంట్లను సీక్రెట్‌గా రికార్డు చేసి..

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెక్ గ్రౌను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటి వరకు మెక్ గ్రౌ రెండు మెడికల్ సెంటర్లలో 3 వేల మంది మహిళా పేషెంట్లను ఎగ్జామిన్ చేసినట్లుగా ఆర్మీ వెల్లడించింది.

J

International | Published On Dec 10, 2025, 7.00 pm IST

చెకప్ పేరుతో మహిళా పేషెంట్లను సీక్రెట్‌గా రికార్డు చేసి..
Advertisement

మహిళలకు చివరకు ఆసుపత్రుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ డాక్టర్ తన దగ్గర చెకప్ చేయించుకోవడానికి వచ్చిన మహిళా పేషెంట్లను చెకప్‌ల పేరుతో సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ ఘటన యూఎస్‌లోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.

ఆర్మీకి చెందిన ఆసుపత్రిలో పనిచేస్తున్న మెక్ గ్రౌ ఒక గైనకాలజిస్ట్. తన దగ్గరికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే మహిళా పేషెంట్లలో చాలామందిని సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసినట్టుగా అధికారులు నిర్ధారించారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్‌లో ఉన్న కార్ల్ ఆర్.డార్నెల్ ఆర్మీ మెడికల్ కాలేజీలో 44 మంది మహిళలను సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు అధికారులు గుర్తించారు. అంతకుముందు హవాయ్‌లోని ట్రిప్లర్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో పని చేసిన మెక్ గ్రౌ.. అక్కడ కూడా కొందరు మహిళలను ఎగ్జామిన్ చేసే సమయంలో సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు తెలిపారు.

ఓ వ్యక్తి తన భార్యను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఈ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయం బయటపడింది. ఆ మహిళను ఎగ్జామిన్ చేస్తున్న సమయంలో డాక్టర్ ఫోన్ కెమెరా పై భాగాన్ని తన భార్య ప్రైవేట్ పార్టు కనిపించేలా పెట్టడంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి వెంటనే హాస్పిటల్ స్టాఫ్‌ను అలర్ట్ చేయడంతో ఆ డాక్టర్ బండారం మొత్తం బయటపడింది.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెక్ గ్రౌను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటి వరకు మెక్ గ్రౌ రెండు మెడికల్ సెంటర్లలో 3 వేల మంది మహిళా పేషెంట్లను ఎగ్జామిన్ చేసినట్లుగా ఆర్మీ వెల్లడించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement