PM Modi Malaysia Visit 2026 | మలేషియాలో త్వరలో యూపీఐ సేవలు.. ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ‘డిజిటల్’ కానుక
మలేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే మలేషియాలో భారత్ డిజిటల్ చెల్లింపుల వేదిక 'యూపీఐ' (UPI) అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అలాగే ఓసీఐ కార్డులు, స్కాలర్‌షిప్‌లపై ప్రవాసులకు తీపి కబురు అందించారు.
International | Published On Feb 7, 2026, 7.59 pm IST
PM Modi Malaysia Visit 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మలేషియా పర్యటనలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారత్‌కు చెందిన ప్రతిష్టాత్మక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) త్వరలోనే మలేషియాలో ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. 2026 సంవత్సరంలో తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా మలేషియా చేరుకున్న మోదీకి, అక్కడి ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘనస్వాగతం పలికారు.
ప్రవాస భారతీయులకు వరాల జల్లు
కౌలాలంపూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ భారత సంతతికి చెందిన మలేషియన్లకు కీలక హామీలు ఇచ్చారు. భారత సంతతికి చెందిన మలేషియా పౌరులకు ఆరో తరం (6th Generation) వరకు ఓసీఐ కార్డు (OCI Card) అర్హతను పొడిగిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇండియన్ స్కాలర్‌షిప్ ట్రస్ట్ ఫండ్‌కి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తిరువళ్లువర్ స్కాలర్‌షిప్ (Thiruvalluvar Scholarship)ను అందజేయనున్నట్లు వెల్లడించారు. నో ఇండియా ప్రోగ్రామ్(Know India Programme)లోనూ ఎన్ఆర్ఐలు యాక్టివ్‌గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. మలేషియాలో భారత్ త్వరలోనే కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించబోతోందని మోదీ ఈసందర్భంగా ప్రకటించారు.
అన్వర్ ఇబ్రహీంతో ప్రత్యేక అనుబంధం
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన పట్ల చూపిన గౌరవానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. "ప్రధాని అన్వర్ విమానాశ్రయానికి వచ్చి నన్ను ఆహ్వానించడమే కాకుండా, సభా వేదిక వరకు నాతో కలిసి రావడం భారత్ పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం" అని పేర్కొన్నారు. అన్వర్ ఇబ్రహీంకు భారతీయ సంగీతం, ముఖ్యంగా దివంగత ఎంజీఆర్ పాటలంటే ఉన్న ఇష్టాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత సంవత్సరం మలేషియాలో జరిగిన ASEAN Summit కి హాజరుకాలేకపోయానని, కానీ త్వరలోనే మలేషియా వస్తా అని తన ఫ్రెండ్‌కి మాటిచ్చానని, ఆ మాట ప్రకారం 2026 లో తన తొలి పర్యటన మలేషియా అని మోదీ స్పష్టం చేశారు.
జకీర్ నాయక్ అప్పగింతపై చర్చలు
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వివాదాస్పద ఇస్లామిక్ ప్రబోధకుడు జకీర్ నాయక్ అప్పగింత అంశాన్ని భారత్ మరోసారి ప్రస్తావించనుంది. రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాలలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
https://x.com/narendramodi/status/2020111192719782338
https://x.com/narendramodi/status/2020109198701330540
https://x.com/narendramodi/status/2020133724160135546
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






