Video | సిడ్నీ కాల్పుల్లో సాహసం.. ఒంటి చేత్తో ఉగ్రవాదిని వెంబడించి పట్టుకున్న సామాన్యుడు
ఈ దుర్ఘటనలో సామాన్య పౌరుడు చూపించిన తెగువ అసాధారణమైందని ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కొనియాడారు. తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు ఆస్ట్రేలియన్లు ఎంతటి సాహసానికైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపిస్తోంది.. అని ప్రధాని ప్రశంసించారు.
International | Published On Dec 14, 2025, 8.25 pm IST
Video | ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హనుక్కా వేడుకల సమయంలో ఇద్దరు సాయుధులైన దుండగులు ప్రజలపై రెచ్చిపోయారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 12 మంది మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘోర విషాదం నడుమ ఓ సామాన్యుడు చూపించిన తెగువకు ప్రపంచం ఫిదా అయింది. తన చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా, గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న దుండగుడి మీదికి దూకి అతడిని గట్టిగా పట్టుకొని అతడి వద్ద ఉన్న గన్ను లాక్కున్నాడు. ఆ తర్వాత ఆ దుండగుడికి గన్ ఎక్కు పెట్టడంతో ఆ దుండగులు భయపడి సరెండర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోగా మారిన అహ్మద్
ఆ దుండగుడిని పట్టుకున్న వ్యక్తి పేరు అహ్మద్ అల్. తన ప్రాణాలను పణంగా పెట్టి చూపించిన తెగువ వల్లనే చాలామంది ప్రాణాలు దక్కాయని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు కూడా అతడి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
ప్రధాని ప్రశంసలు
ఈ దుర్ఘటనలో సామాన్య పౌరుడు చూపించిన తెగువ అసాధారణమైందని ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కొనియాడారు. తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు ఆస్ట్రేలియన్లు ఎంతటి సాహసానికైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపిస్తోంది.. అని ప్రధాని ప్రశంసించారు.
యూదులు జరుపుకుంటున్న ఈ పండుగను లక్ష్యంగా చేసుకున్న దుండగులు వేడుకలు చేసుకుంటున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఇది ఉగ్రదాడే అని పోలీసులు ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న దుండగుల్లో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుండగుల్లో ఒకడు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతడి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BREAKING: Video shows how bystander disarmed one of the Bondi Beach gunmen pic.twitter.com/YN9lM1Tzls
— The Spectator Index (@spectatorindex) December 14, 2025
తాజావార్తలు
- ●Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...
- ●KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
- ●Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు
- ●Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?
- ●CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - రంగంలోకి అల్లు అర్జున్ డైరెక్టర్

Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...

KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?

Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు

Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?






