Donald Trump | అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం : ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ (US) ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు.
International | Published On Feb 6, 2026, 11.42 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ (US) ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. దేశ రక్షణ రంగాన్ని ఎన్నడూలేని స్థాయిలో బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. నా మొదటి పదవీకాలంలోనే మిలిటరీని పూర్తిగా అత్యున్నతంగా తీర్చిదిద్దాను. కొత్త అణ్వాయుధాలను అభివృద్ధి చేశాం. పాత వాటిని రీఫర్బిష్ చేశాం. ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. అమెరికా సైనిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం చాలా గొప్పది. అంతేకాదు, అమెరికా అంతరిక్ష దళాన్ని కూడా ఏర్పాటు చేశాం. అంతరిక్ష భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్య అమెరికా రక్షణ వ్యవస్థను మరింత బలపరిచింది. భవిష్యత్ యుద్ధాలు భూమి మీదే కాకుండా అంతరిక్షంలోనూ జరుగుతాయి. అందుకే స్పేస్ ఫోర్స్ చాలా కీలకం’ అని పేర్కొన్నారు. అంతేకాదు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సేవలందించిన లోవా, మిస్సౌరీ, అలబామా వంటి యుద్ధనౌకల కంటే 100 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన ఆధునిక బ్యాటిల్‌షిప్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. సముద్ర రక్షణను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు.
https://x.com/ANI/status/2019510322583990512/
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






