Aliens | ఏలియన్స్ సమాచారాన్ని బహిర్గతం చేస్తాం : ట్రంప్
Aliens | గ్రహాంతర జీవుల (Aliens)పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర జీవుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని అధికారులను ఆదేశించారు.
International | Published On Feb 20, 2026, 1.42 pm IST
Aliens | గ్రహాంతర జీవుల (Aliens)పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏలియన్స్ ఉన్నది నిజమేనని.. అవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఏలియన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏలియన్స్ విషయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర జీవుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఏలియన్స్ గురించి ప్రజల్లో “తీవ్రమైన ఆసక్తి” ఉంది అని ట్రంప్ అన్నారు. ఏలియన్స్, గ్రహాంతర జీవులు, యుఎఫ్ఓ (UFO), యుఎపి (UAP) సంబంధిత అన్ని ప్రభుత్వ ఫైళ్లనూ గుర్తించి విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అవును ఏలియన్స్ ఉన్నాయి
ఏలియన్స్ (గ్రహాంతర వాసి) నిజంగా ఉన్నారా లేదా అనే విషయంలో చాలా ఏళ్లుగా భిన్నాభిప్రాయాలున్నాయి. ఏలియన్స్ ఉన్నాయని కొందరు.. లేవని ఇంకొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అయితే, అవి ఎక్కడున్నాయో కచ్చితంగా తెలియదన్నారు. తాను వాటిని చూడలేదని.. వాటిని అమెరికాకు చెందిన రహస్య ప్రదేశం నెవెడా (Nevada)లోని ఏరియా 51లో (Area 51) ఉంచారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. అక్కడ వాటిని దాచడానికి ఎలాంటి భూగర్భ సౌకర్యం లేదన్నారు. ఏదైనా భారీ కుట్ర ఉంటే తప్ప అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా అలాంటి విషయాన్ని దాచలేరని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






