Trump Tariffs | గ్రీన్‌లాండ్ వివాదం.. ఆ 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు: ట్రంప్
Trump Tariffs | ష్యా, చైనాలను బూచీగా చూపి ఖనిజ సంపన్నమైన గ్రీన్‌లాండ్‌ను (Greenland) స్వాధీనం చేసుకోవాలన్న తన ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్రమంగా ఆచరణలోకి తీసుకొస్తున్నారు.
International | Published On Jan 18, 2026, 7.53 am IST
త్రినేత్ర.న్యూస్: రష్యా, చైనాలను బూచీగా చూపి ఖనిజ సంపన్నమైన గ్రీన్‌లాండ్‌ను (Greenland) స్వాధీనం చేసుకోవాలన్న తన ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్రమంగా ఆచరణలోకి తీసుకొస్తున్నారు. డెన్మార్క్ ఆధీనంలో స్వతంత్ర ప్రాంతంగా ఉన్న గ్రీన్‌లాండ్ కొనుగోలు విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఐరోపా దేశాలపై (European countries) ట్రంప్ అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. 8 యూరోపియన్ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా వెల్లడించారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకులపై ఈ అదనపు సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, యూరోపియన్ యూనియన్ దేశాలపై అదనంగా సుంకాలు విధిస్తానని గత శుక్రవారం ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాగా, గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ వాదనతో అమెరికన్ కాంగ్రెస్ ద్వైపాక్షిక ప్రతినిధి బృందం విభేదించింది. ట్రంప్ మాటలెలా ఉన్నా తాము డెన్మార్క్‌కు, దాని భూభాగమైన గ్రీన్‌లాండ్‌కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేసింది.
జూన్ 1 నాటికి 25 శాతానికి పెంపు?
అదనపు సుంకాలు 10 శాతంతోనే ఆగవని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా అమెరికా పరం చేసేలా జూన్ 1నాటికి అంగీకారం కుదరకపోతే సుంకాలను ఏకంగా 25శాతానికి పెంచుతానని హెచ్చరించారు. `గ్రీన్‌లాండ్ అమెరికా చేతుల్లోకి రాకపోవడాన్ని అంగీకరించేది లేదు. రష్యా, చైనాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించకుండా ఉండాలంటే అమెరికా నియంత్రణ అవసరం` అని ఆయన పేర్కొన్నారు.
భయపడేది లేదన్న ఈయూ..
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని యూరోపియన్ యూనియన్ (European Union) దేశాలు స్పష్టం చేశాయి. డెన్మార్క్‌కు మద్దతుగా పలు దేశాలు తమ సైనిక దళాలను గ్రీన్‌లాండ్‌కు పంపించాయి. ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యురెన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ 15 మంది మౌంటెయిన్ స్పెషలిస్టులతో కూడిన బృందాన్ని పంపించగా, జర్మనీ 13 మంది రికనయిస్సెన్స్ నిపుణులతో కూడిన బృందాన్ని గ్రీన్‌లాండ్‌కు తరలించింది. యూకే ఒక అధికారిని, నార్వే ఇద్దర్ని, స్వీడన్ ముగ్గుర్ని పంపి ఈ ఆపరేషన్‌కు మద్దతు తెలిపాయి. నాటో ప్రత్యక్ష కమాండ్‌కు వెలుపల ఈ విధంగా యూరోపియన్ దేశాలు సంయుక్తంగా సైనిక చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






