Post Office RD Scheme | నెలకు రూ.600 పొదుపు చేస్తే.. రూ. 1 లక్ష పొందవచ్చు.. ఎలాగంటే..?
Post Office RD Scheme | దేశవ్యాప్తంగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఎస్‌బీఐ అందిస్తున్న సేవలకు గాను ఆ బ్యాంకు ఎంతో పేరుగాంచింది. దేశంలోనే నంబర్ వన్ బ్యాంక్‌గా నిలిచింది. కోట్లాది మంది భారతీయులు ఎస్‌బీఐని మొదటి ఎంపికగా భావిస్తున్నారు. అంతేకాకుండా తమ డబ్బుకు ఆ బ్యాంకును సురక్షితమైందిగా భావిస్తున్నారు.
Post Office RD Scheme | దేశవ్యాప్తంగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఎస్‌బీఐ అందిస్తున్న సేవలకు గాను ఆ బ్యాంకు ఎంతో పేరుగాంచింది. దేశంలోనే నంబర్ వన్ బ్యాంక్‌గా నిలిచింది. కోట్లాది మంది భారతీయులు ఎస్‌బీఐని మొదటి ఎంపికగా భావిస్తున్నారు. అంతేకాకుండా తమ డబ్బుకు ఆ బ్యాంకును సురక్షితమైందిగా భావిస్తున్నారు. ఎస్‌బీఐలో ఎలాంటి ఒత్తిడి లేకుండా డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దేశంలోనే ఎస్‌బీఐ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించి ప్రజలకు సేవలను అందిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. ప్రజలు చిన్న చిన్న నెలవారి మొత్తాలతో డబ్బును పొదుపు చేసి భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకునేందుకు ఎస్‌బీఐ బాటలు వేస్తోంది. అయితే ఎస్‌బీఐలో ప్రజలకు అందుబాటులో ఉన్న పథకాల్లో హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ (RD) పథకం కూడా ఒకటి.
ఎస్‌బీఐ ఆర్‌డీ స్కీం..
ఎస్‌బీఐకి చెందిన రికరింగ్ డిపాజిట్ పథకం క్రమశిక్షణతో మెలిగే పెట్టుబడిదారుల కోసం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒకేసారి పెద్ద ఎత్తున డబ్బును పొదుపు చేయాల్సిన అవసర్ లేదు. నెల నెలా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. దీంతో సుదీర్ఘకాలంలో ప్రజలు పెట్టే డబ్బుపై ఆకర్షణీయమైన రీతిలో వడ్డీ వస్తుంది. అలాగే దీర్ఘకాలంలో చక్కని ఆదాయాన్ని కూడా పొందవచ్చు. నెల నెలా చిన్న మొత్తాలతో ప్రారంభించి ఈ పథకంలో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. హర్ ఘర్ లఖ్‌పతి RD పథకంలో సీనియర్ సిటిజన్లకు SBI ప్రస్తుతం గరిష్టంగా 7.05 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఇది సాధారణ ఖాతాదారులకు లభించే వడ్డీ కంటే ఎక్కువ కావడం విశేషం. పెట్టుబడి కాలపరిమితి కూడా అనువుగా ఉంటుంది. కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఎంచుకునే వెసులుబాటు ఉంది. తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

10 ఏళ్లలో జమ అయ్యే మొత్తం..
పెద్ద ఆదాయం లేకపోయినా పెద్ద మొత్తాన్ని సృష్టించవచ్చని ఈ పథకం ద్వారా స్పష్టమవుతోంది. ప్రతి నెలా కేవలం రూ.610 పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, గడువు పూర్తయ్యే సరికి మొత్తం పొదుపు రూ.1 లక్షకు చేరుకుంటుంది. జీతం పొందే ఉద్యోగులు, తొలిసారి పెట్టుబడులు ప్రారంభిస్తున్న వారు లేదా ఆర్థిక ఒత్తిడి లేకుండా పొదుపు చేయాలనుకునే వారందరికీ దీన్ని అనుకూలమైన ఎంపికగా చెప్పవచ్చు. హర్ ఘర్ లఖ్‌పతి పథకం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి భారతీయ పౌరుడికి అందుబాటులో ఉంది. అలాగే 10 సంవత్సరాలలోపు పిల్లల పేరుపై తల్లిదండ్రులు RD ఖాతాను తెరవచ్చు. 10 సంవత్సరాలు దాటిన పిల్లల విషయంలో తల్లిదండ్రులతో కలిసి జాయింట్ ఖాతాను ప్రారంభించవచ్చు. చిన్న వయసులోనే ఆర్థిక ప్రణాళికకు ఇది మంచి అవకాశాన్ని అందిస్తుంది.
ఇక ఈ పథకానికి పూర్తిగా ప్రభుత్వ రక్షణ ఉంటుంది. స్థిరమైన రాబడులు వస్తాయి. ప్రజలకు కూడా నెలవారి పొదుపు అలవాటవుతుంది. ఈ మూడు కారణాల వల్ల ఈ పథకం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. SBI హర్ ఘర్ లఖ్‌పతి RD పథకంలో చిన్న మొత్తాలతో క్రమంగా పొదుపు చేస్తే, కాలక్రమేణా అది బలమైన ఆర్థిక వనరుగా మారుతుంది. దీంతో ఆ మొత్తం భవిష్యత్తులో వచ్చే అత్యవసర ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



