త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Asia | ఇరాన్‌లో వైమానిక దాడులు.. ప‌లు ప్రాంతాల్లో విధ్వంసం.. 13 మంది దుర్మ‌ర‌ణం..

West Asia | ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణ పడమర దిశలో ఉన్న ఇస్లాంశహర్ సమీపంలోని ఓ నివాస భవనంపై సోమవారం తెల్లవారుజామున జరిగిన వైమానిక దాడిలో కనీసం 13 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి నగరానికి సమీపంలోని ఒక కాలనీలో జరిగింది. ఆ భవనాన్ని లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియ‌రాలేదు.

P

International | Published On Apr 6, 2026, 9.42 am IST

West Asia | ఇరాన్‌లో వైమానిక దాడులు.. ప‌లు ప్రాంతాల్లో విధ్వంసం.. 13 మంది దుర్మ‌ర‌ణం..
Advertisement

West Asia | ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణ పడమర దిశలో ఉన్న ఇస్లాంశహర్ సమీపంలోని ఓ నివాస భవనంపై సోమవారం తెల్లవారుజామున జరిగిన వైమానిక దాడిలో కనీసం 13 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి నగరానికి సమీపంలోని ఒక కాలనీలో జరిగింది. ఆ భవనాన్ని లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియ‌రాలేదు. దాడి తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా ధ్వంస‌మైందని మీడియా తెలిపింది. భ‌వ‌నం శిథిలాల కింద కొంద‌రు చిక్కుకుపోయి ఉండ‌వ‌చ్చ‌నే అనుమానాలున్నాయి. ఈ క్ర‌మంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీపై కూడా వైమానిక దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో విశ్వవిద్యాలయానికి చెందిన కొన్ని భవనాలు, సమీపంలోని గ్యాస్ స‌ర‌ఫ‌రా కేంద్రం దెబ్బ‌తిన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, యూనివర్సిటీ క్యాంపస్‌లో అసలు లక్ష్యం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. యుద్ధ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడడంతో తరగతులు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. దీంతో యూనివర్సిటీ క్యాంపస్ ఖాళీగా ఉంది. స్థానికుల ప్రకారం.. తక్కువ ఎత్తులో ఎగిరిన యుద్ధ విమానాల గర్జనలు గంటల తరబడి వినిపించడంతో ప్రజల్లో మ‌రింత భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రామ్‌.. సైనిక పరిశోధనలతో సంబంధాలున్న కారణంగా ఈ యూనివర్సిటీపై గతంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి.

ఈ పరిశోధనలపై ఇరాన్ పరామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ నియంత్రణ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌లో భద్రతా సంస్థలు క్షిపణి హెచ్చరికలు జారీ చేయగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయిలో రెండుసార్లు అలర్ట్‌లు వినిపించాయి. గగన రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశారు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాలు ఏవన్నది స్పష్టంగా తెలియలేదు. కువైట్ కూడా రాత్రి పూట పలు సార్లు తన గగన రక్షణ వ్యవస్థలను వినియోగించినట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న ముఖ్యమైన షియా మతపరమైన కేంద్రం ఖోమ్ నగరంలోని ఓ నివాస ప్రాంతంపై జరిగిన మరో వైమానిక దాడిలో కనీసం ఐదుగురు మృతి చెందినట్లు ఇరాన్ డైలీ పేర్కొంది. ఈ దాడి లక్ష్యం ఏమిటన్నది అక్కడ కూడా స్పష్టంగా తెలియలేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలో మొత్తం నష్టం, మృతుల సంఖ్యపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు.

Advertisement
Advertisement