Bangladesh | ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
Bangladesh | న్యూఢిల్లీ (New Delhi)లోని బంగ్లాదేశ్ (Bangladesh) హై కమిషన్ కార్యాలయం (High Commission Office) ఎదుట వీహెచ్‌పీ (VHP) కార్యకర్తలు భారీ నిరసన తెలిపారు.
International | Published On Dec 23, 2025, 1.44 pm IST
Bangladesh | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లోని బంగ్లాదేశ్ (Bangladesh) హై కమిషన్ కార్యాలయం (High Commission Office) వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హై కమిషన్ కార్యాలయం ఎదుట వీహెచ్‌పీ (VHP) కార్యకర్తలు భారీ నిరసన తెలిపారు. బారీకేడ్లు నెట్టకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు (Police) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
బంగ్లాదేశ్‌లోని మయమన్‌సింగ్ జిల్లాలో దీపూచంద్రదాస్ (25)పై గత వారం దాడి చేసిన దుండగులు అతడిని చిత్రహింసలకు గురిచేసి, చెట్టుకు వేలాడదీసి ఉరివేశారు. అనంతరం రహదారి పక్కన పడేయగా, అతడి మృతదేహానికి కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించారు. మైనార్టీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా చట్టసభ సభ్యులు బంగ్లాదేశ్‌కు సూచించారు.
మరోవైపు చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్‌పై దాడి జరగడాన్ని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత అమీర్ ఖస్రు తీవ్రంగా ఖండించారు. దీనిని నియంత్రించడంలో బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ విఫలమయ్యారని ఆరోపించారు. రానున్న ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరుగనున్నాయి.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



