త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kohat Military Base | పాక్‌ సైన్యం వ్యూహాత్మక కేంద్రాలపై అఫ్ఘాన్‌ దాడి..!

Kohat Military Base | అఫ్గానిస్తాన్ తాలిబాన్ శుక్రవారం పాకిస్తాన్ సైన్యానికి చెందిన వ్యూహాత్మక కేంద్రాలను కోహాట్ ప్రాంతంలో ప్రతీకార డ్రోన్ దాడులతో లక్ష్యంగా చేసిందని అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

P

International | Published On Mar 13, 2026, 7.38 pm IST

Kohat Military Base | పాక్‌ సైన్యం వ్యూహాత్మక కేంద్రాలపై అఫ్ఘాన్‌ దాడి..!
Advertisement

Kohat Military Base | అఫ్గానిస్తాన్ తాలిబాన్ శుక్రవారం పాకిస్తాన్ సైన్యానికి చెందిన వ్యూహాత్మక కేంద్రాలను కోహాట్ ప్రాంతంలో ప్రతీకార డ్రోన్ దాడులతో లక్ష్యంగా చేసిందని అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతీకార దాడుల్లో కోహాట్ మిలిటరీ ఫోర్ట్, డురాండ్ లైన్‌ వెంట ఉన్న యుద్ధ కమాండ్ సెంటర్, ఫోర్ట్ కమాండర్ కార్యాలయాలు, సైనికుల నివాసాలు, ఆయుధ నిల్వలు అన్నీ భారీ నష్టానికి లోనయ్యాయి. ఫోర్ట్‌లోని సైనిక సదుపాయాలు, కమాండ్ సెంటర్, డిపోలు, సైనికుల నివాసాలు ధ్వంసమై, భౌతికంగా భారీ నష్టం జరిగిందిన రక్షణశాఖ తెలిపింది. ఈ దాడులు పాకిస్తాన్ సైన్యం ఖోస్ట్ ప్రావిన్స్‌లోని అలీషర్-టెరేజై జిల్లాలో డురాండ్ లైన్ సమీపంలో కాల్పులు జరిపిన తర్వాత జరిగాయి. షెల్లింగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పాక్ ఎయిర్ ఫోర్స్ అఫ్గానిస్తాన్ కందహార్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ప్రైవేట్ ఎయిర్లైన్ కమ్ ఎయిర్‌కి చెందిన ఇంధన డిపోల్స్‌పై కూడా దాడి చేసింది.

తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ కంపెనీ దేశీయ ఎయిర్‌లైన్లు, ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇంధన సరఫరా చేస్తుందన్నారు. పాక్ గతంలో దేశీయ వ్యాపారి హాజీ ఖాన్ జాదా ఇంధన నిల్వలపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడులు ఫిబ్రవరిలో డురాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మధ్య పెరుగుతున్న వైమానిక దాడుల నేపథ్యంలో జరిగాయి. డురాండ్ లైన్ వివాదం, 2021లో తాలిబాన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం వల్ల పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ తాలిబాన్ (TTP) అఫ్గానిస్తాన్‌లో ఆశ్రయాన్ని పొందుతున్నాయని, వాటిని నియంత్రించాలని కోరుతోంది. టీటీపీ 2007లో పాకిస్తాన్‌లో ఏర్పడింది. అఫ్గానిస్తాన్ తాలిబాన్‌తో వేరుగా ఉన్నప్పటికీ, ఆలోచనా, భాషా, సామాజిక సంబంధాలలో పాకిస్తాన్ తాలిబాన్‌కు దగ్గరగా ఉంది. ఇటీవరి సంవత్సరాల్లో టీటీపీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులు పెరగడంతో, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.

Advertisement
Advertisement