త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pensions | అక్క‌డ ఎంపీల‌కు పెన్ష‌న్లు ర‌ద్దు.. ప్ర‌స్తుతం ప‌ద‌విలో ఉన్న‌వారికి కూడా..

Pensions | త్రినేత్ర‌.న్యూస్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గ‌ట్టెంక్కించేందుకు శ్రీలంక (SriLanka) ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా క్రికెట్ స‌హా ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డిన శ్రీలంక‌కు క‌రోనా, ఉగ్ర‌వాద దాడులతో విదేశీయుల రాక పూర్తిగా త‌గ్గిపోయింది.

G

International | Published On Feb 18, 2026, 7.21 am IST

Pensions | అక్క‌డ ఎంపీల‌కు పెన్ష‌న్లు ర‌ద్దు.. ప్ర‌స్తుతం ప‌ద‌విలో ఉన్న‌వారికి కూడా..
Advertisement

Pensions | త్రినేత్ర‌.న్యూస్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గ‌ట్టెంక్కించేందుకు శ్రీలంక (SriLanka) ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా క్రికెట్ స‌హా ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డిన శ్రీలంక‌కు క‌రోనా, ఉగ్ర‌వాద దాడులతో విదేశీయుల రాక పూర్తిగా త‌గ్గిపోయింది. దీంతో దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా దిగ‌జారిపోయాయి. ఈ క్ర‌మంలో టీ20 క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకున్న‌ది. భార‌త్‌తో మ్యాచ్ ఆడేది లేద‌ని మొండికేసిన పాక్ ప్ర‌భుత్వాన్ని ఒప్పించి మ్యాచ్ జ‌రిగేలా ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా ఎంపీలకు పెన్ష‌న్ల‌ను (Pensions) ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీనికి ఆ దేశ పార్ల‌మెంటు కూడా ఆమోదం తెలిపింది.

225 మంది సభ్యులు కలిగిన సభలో 154 మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించ‌గా, మిగిలిన సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దేశంలో ఐదేండ్లు సర్వీసు పూర్తి చేసిన పార్లమెంట్‌ సభ్యులకు ప్రస్తుతం పెన్షన్‌ అందుతోంది. కొత్త చట్టం ఆమోదంతో ఇప్పటికే పెన్ష‌న్లు అందుకుంటున్న వారితో పాటు, కొత్తగా అర్హత సాధించిన వారికీ నిలిచిపోనున్నాయి. మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను దిసనాయకే ప్రభుత్వం గ‌తంలోనే నిలిపివేసింది. ఇంటి కిరాయిలు, అలవెన్సులు, పెన్షన్లు, రవాణా సౌకర్యాలను గతేడాది సెప్టెంబర్‌లో రద్దు చేసింది.

ప్ర‌ధానంగా ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డిన శ్రీలంక 2022లో దివాళా తీసింది. దేశంలో ఆహారం, ఔషధాలు, విద్యుత్‌, చమురుకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ప్రజల నుంచి ఆందోళనలు చెలరేగడంతో నాటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత జ‌రిగిన జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే (Anura kumara Dissanayake) విజయం సాధించారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆయ‌న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో భాగంగా ఎన్నికల వాగ్దానంలో ఒకటైన పెన్షన్ల రద్దుకు బిల్లు తీసుకొచ్చారు.

Advertisement
Advertisement