త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia – Ukraine | కార్గో షిప్‌పై ర‌ష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి

Russia - Ukraine | ర‌ష్యా - ఉక్రెయిన్ మ‌ధ్య మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టులో ఎంవీ గోల్డెన్ లియో అనే కార్గో షిప్‌పై ర‌ష్యా శ‌నివారం దాడి చేసింది.

S

International | Published On Jul 21, 2026, 8.02 am IST

Russia – Ukraine | కార్గో షిప్‌పై ర‌ష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి
Advertisement

Russia - Ukraine | త్రినేత్ర‌.న్యూస్ : ర‌ష్యా - ఉక్రెయిన్ మ‌ధ్య మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టులో ఎంవీ గోల్డెన్ లియో అనే కార్గో షిప్‌పై ర‌ష్యా శ‌నివారం దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న‌లుగురు భార‌తీయులు ఉన్నారు. తీవ్ర గాయాల‌పాలైన మ‌రో భార‌తీయుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ర‌ష్యా దాడి చేసిన స‌మ‌యంలో నౌక‌లో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్న‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.

మొక్క‌జొన్న‌ను తీసుకెళ్తున్న గోల్డెన్ లియో కార్గో షిప్‌పై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి అండ్రీ సైబిహా తెలిపారు. అయితే ఈ కార్గో షిప్‌పై ర‌ష్యా మూడు క్రూయిజ్ క్షిప‌ణుల‌తో దాడి చేసింద‌ని పేర్కొన్నారు. దీంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌ల ధాటికి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. వీరిలో తొమ్మిది మంది సిబ్బంది కాగా, ఒక‌రు పైల‌ట్ అని పేర్కొన్నారు.

దాడిని ఖండించిన భార‌త్

భార‌త నావికుల‌పై దాడిని సోమవారం భారత్‌ ఖండించింది. వాణిజ్య నౌకలపై దాడులు చేసి అమాయక పౌరుల ప్రాణాలు తీయడం ఘోరమైన విషయమని, దాన్ని నివారించాలని పేర్కొంది.

Advertisement
Advertisement