PM Modi | పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్..
PM Modi | ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. పౌరుల భద్రత అత్యున్నత ప్రాధాన్యంగా ఉండాలని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు మోదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
International | Published On Mar 2, 2026, 6.42 am IST
PM Modi | ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. పౌరుల భద్రత అత్యున్నత ప్రాధాన్యంగా ఉండాలని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు మోదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఎక్స్ లో చేసిన పోస్టులో, తాజా పరిణామాలపై భారత ఆందోళనలను తెలియజేశానని, తక్షణ శత్రుత్వ విరమణ అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో టెలిఫోన్‌లో మాట్లాడాను. తాజా పరిణామాలపై భారత ఆందోళనలను వ్యక్తం చేసి, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశాను. శత్రుత్వానికి త్వరితగతిన ముగింపు పలకాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోంది.. అని ఆయన తెలిపారు.
Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu
— Narendra Modi (@narendramodi) March 1, 2026
యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్..
అదేవిధంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. యూఏఈపై జరిగిన తాజా దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం తెలిపారు.
యూఏఈ అధ్యక్షుడు, నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడాను. యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించాను. ప్రాణనష్టం పట్ల సంతాపం తెలియజేశాను. ఈ కఠిన సమయంలో భారత్ యూఏఈతో ఐక్యంగా నిలుస్తోంది. అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజాన్ని సంరక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను. ఉద్రిక్తతలు తగ్గాలని, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వానికి మద్దతు ఇస్తున్నాము.. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై ఆపరేషన్ రోరింగ్ లయన్/ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట క్షిపణి దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమయ్యారు. ఆయన కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు కూడా ఈ దాడుల్లో మరణించారు. మరో 48 ఇరాన్ అగ్ర నాయకులు, టాప్ కమాండర్లు కూడా ఈ దాడుల్లో మృతి చెందారని అమెరికా తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






