త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi Speaks With Saudi Crown Prince | గల్ఫ్ అధినేతలతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

బహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోందన్న ప్రధాని.. ఈ కష్ట సమయంలో ఆ దేశ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.

J

International | Published On Mar 2, 2026, 8.07 pm IST

PM Modi Speaks With Saudi Crown Prince | గల్ఫ్ అధినేతలతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ
Advertisement

PM Modi Speaks With Saudi Crown Prince | పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తూ ఇటీవల జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడం అత్యంత ఆవశ్యకమని తామిద్దరం అంగీకరించామన్నారు. ఈ కష్టకాలంలో భారతీయ సమాజం బాగోగులు చూసుకుంటున్నందుకు ప్రిన్స్‌కి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

బహ్రెయిన్ రాజు హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫాతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. బహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోందన్న ప్రధాని.. ఈ కష్ట సమయంలో ఆ దేశ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. బహ్రెయిన్‌లోని భారతీయ సమాజానికి వారు అందిస్తున్న స్థిరమైన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

https://x.com/narendramodi/status/2028457704352571568

https://x.com/narendramodi/status/2028457037852549451

Advertisement
Advertisement