త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pak Petrol Rates | పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..!

Pak Petrol Rates | ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-యూఎస్ దాడులు మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా దాయాది దేశం ప‌రిస్థితి. ఇప్ప‌టికే ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ఆర్థికంగా క‌ష్టాలుప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఆ దేశ పౌరుల‌కు ప్ర‌భుత్వం మ‌రోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.55 మేర పెంచింది.

P

International | Published On Mar 8, 2026, 5.36 pm IST

Pak Petrol Rates | పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..!
Advertisement

Pak Petrol Rates | ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-యూఎస్ దాడులు మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా దాయాది దేశం ప‌రిస్థితి. ఇప్ప‌టికే ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ఆర్థికంగా క‌ష్టాలుప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఆ దేశ పౌరుల‌కు ప్ర‌భుత్వం మ‌రోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు పాక్ క‌రెన్సీలో రూ.55 మేర పెంచింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.321.17కి, డీజిల్ ధర రూ.335.86కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశీయ ధరలను సవరించాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఒత్తిడి కూడా ఈ నిర్ణయానికి కార‌ణంగా తెలుస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన పాక్ త‌క్ష‌ణ‌మే ఇంధ‌న ధ‌ర‌లు పెంచాల‌ని సూచించింది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు జరిపిన తర్వాత పశ్చిమ ఆసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయుత్లా అలీ ఖమెనీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాంతో ఇరాన్ అనేక అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. మరోవైపు ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై దాడులు కొనసాగిస్తూ లెబనాన్‌లో హిజ్బుల్లాపై సైనిక చర్యలకు దిగింది.

ఈ ఘర్షణలు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ప్ర‌పంచ ఆయిల్ సరఫరాలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా సౌదీ అరేబియా, యూఏఈ నుంచి పాక్‌తో పాటు ప‌లు దేశాల‌కు చ‌మురు దిగుమ‌తి అవుతుంది. ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారితే సరఫరాపై మ‌రింత ప్ర‌భావం ప‌డుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాక్ అధికారులు పేర్కొన్నారు. ఇంధన ధరల భారీ పెంపు పాకిస్థాన్‌లో ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రవాణా ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయ‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement