త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol Diesel Prices | వాహ‌న‌దారుల‌కు చుక్క‌లే.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రెండిత‌లు

Petrol Diesel Prices | మూలిగే న‌క్క మీద తాటిపండు ప‌డింద‌న్న చంద‌నా పాకిస్థాన్ (Pakistan) ప‌రిస్థితి మారింది. అస‌లే పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన ఆ దేశాన్ని ప‌శ్చిమాసియాలో యుద్ధం మ‌రింత చిక్కుల్లోకి నెట్టేసింది.

G

International | Published On Apr 3, 2026, 8.29 am IST

Petrol Diesel Prices | వాహ‌న‌దారుల‌కు చుక్క‌లే.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రెండిత‌లు
Advertisement

Petrol Diesel Prices | త్రినేత్ర‌.న్యూస్‌: మూలిగే న‌క్క మీద తాటిపండు ప‌డింద‌న్న చంద‌నా పాకిస్థాన్ (Pakistan) ప‌రిస్థితి మారింది. అస‌లే పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన ఆ దేశాన్ని ప‌శ్చిమాసియాలో యుద్ధం మ‌రింత చిక్కుల్లోకి నెట్టేసింది. ఇరాన్‌ ‍యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో పాక్‌ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. డీజిల్, పెట్రోల్ ధరలను (Petrol Diesel Prices) రెండింత‌లు పెంచింది. డీజిల్ ధ‌ర‌లు 54.9 శాతం పెర‌గ‌గా, పెట్రోల్ ధ‌ర‌ల‌ను 42.7 శాతం అధికం చేసింది. దీంతో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.520.35 (పాకిస్థానీ రూపాయలు)కు చేర‌గా, పెట్రోల్ రూ.458.40కి పెరిగింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పెట్రోల్ డీజీల్ ధ‌ర‌లు ఆ దేశ‌ చరిత్రలోనే గ‌రిష్ఠానికి చేరుకున్నాయి.

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమని పాక్‌ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ చెప్పారు. అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరి అయ్యింది వెల్ల‌డించారు. అయితే, యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను కారణంగా గత నెలలో డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20 శాతం మేర‌ పెంచిన విష‌యం తెలిసిందే. ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై మరింత భారం మోపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధ‌ర‌ల పెంపు నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు పెట్రోల్ బంకుల వ‌ద్ద క్యూక‌ట్టాయి. ప్ర‌స్తుత ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Advertisement
Advertisement