త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Washington Hilton Shooting | ట్రంప్ ఈవెంట్‌లో కాల్పుల నిందితుడు ఇతడే.. నాసాలో ఫెలోషిప్ చేసిన థామస్ ఎందుకు ప్రెసిడెంట్‌ని చంపబోయాడు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ప్రతిష్టాత్మక 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' కార్యక్రమంలో కోల్ థామస్ అలెన్ (31) అనే వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించి కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. భారీ ఆయుధాలతో పట్టుబడిన ఈ నిందితుడు మెకానికల్ ఇంజనీర్, నాసా ఫెలో, పార్ట్-టైమ్ టీచర్ అని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడిలో ఒక అధికారికి బుల్లెట్ తగిలినా, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కారణంగా ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

J

International | Published On Apr 26, 2026, 4.22 pm IST

Washington Hilton Shooting | ట్రంప్ ఈవెంట్‌లో కాల్పుల నిందితుడు ఇతడే..  నాసాలో ఫెలోషిప్ చేసిన థామస్ ఎందుకు ప్రెసిడెంట్‌ని చంపబోయాడు?
Advertisement

Washington Hilton Shooting | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం రేపింది. వాషింగ్టన్ హిక్టన్ హోటల్‌లో శనివారం రాత్రి ప్రతిష్టాత్మక 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్' జరుగుతుండగా, ఒక సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కార్యక్రమంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌గా అధికారులు గుర్తించారు.

ఎవరీ కోల్ థామస్ అలెన్?

లింక్డ్‌ఇన్ సహా పలు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆధారంగా నిందితుడి నేపథ్యం వెలుగులోకి వచ్చింది. 2017లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 2014లో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్ చేశాడు. ఐజేకే కంట్రోల్స్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా, కాల్టెక్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం సీ2 ఎడ్యుకేషన్ అనే సంస్థలో పార్ట్-టైమ్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. 2024లో ఇతడిని 'టీచర్ ఆఫ్ ది మంత్'గా ఆ సంస్థ గుర్తించింది. Bohrdom, First Law వంటి ఇండీ వీడియో గేమ్స్‌ను డెవలప్ చేశాడు. 2024లో కమలా హారిస్‌కు మద్దతుగా డెమోక్రటిక్ పార్టీ ప్యాక్‌ కి 25 డాలర్ల విరాళం ఇచ్చినట్లు ఫెడరల్ రికార్డులు చెబుతున్నాయి.

సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఏం జరిగింది?

దాదాపు 2,500 మంది అతిథులున్న బాల్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అతని వద్ద ఒక షాట్‌గన్, ఒక హ్యాండ్‌గన్, పలు కత్తులు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీ పోలీస్ చీఫ్ జెఫరీ కారోల్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చెక్‌పాయింట్ వద్దకు దూసుకురాగానే సీక్రెట్ సర్వీస్ అధికారులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి చాలా దగ్గరి నుండి బుల్లెట్ తగిలింది. అయితే, ఆయన ధరించిన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కారణంగా ప్రాణాపాయం తప్పింది. అలెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు, అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ట్రంప్ స్పందన: 'అతడు మానసిక రోగి'

కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, నిందితుడిని "సిక్ పర్సన్" (మానసిక రోగి) గా అభివర్ణించారు. "ఒక వ్యక్తి భారీ ఆయుధాలతో భద్రతా వలయాన్ని ఛేదించే ప్రయత్నం చేశాడు. కానీ మన సీక్రెట్ సర్వీస్ అధికారులు అద్భుతంగా పనిచేసి అతన్ని పట్టుకున్నారు. గాయపడిన అధికారితో నేను మాట్లాడాను, ఆయన క్షేమంగా ఉన్నారు," అని ట్రంప్ తెలిపారు.

Latest and Breaking News on NDTV

అతను ఒంటరిగానే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో నిందితుడిని బంధించిన ఫోటోలను కూడా ట్రంప్ షేర్ చేశారు.

బాల్‌రూమ్‌లో భయాందోళనలు

కాల్పుల శబ్దం వినబడగానే బాల్‌రూమ్‌లోని 2,600 మంది అతిథుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. "కిందకు వంగండి" అంటూ అరుపులు వినిపించాయి. చాలామంది ప్రాణభయంతో టేబుల్స్ కింద దాక్కున్నారు. వెంటనే రంగంలోకి దిగిన కమాండోలు ట్రంప్, మెలానియా, జేడీ వాన్స్ తదితర ప్రముఖులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో డిన్నర్ కార్యక్రమం రద్దయింది.

దర్యాప్తు, అభియోగాలు

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ మాట్లాడుతూ.. నిందితుడి నేపథ్యాన్ని లోతుగా విశ్లేషిస్తున్నామని, బాలిస్టిక్ ఆధారాలను సేకరించామని తెలిపారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యూఎస్ అటార్నీ జీనీన్ పిర్రో మాట్లాడుతూ.. అలెన్‌పై ఫెడరల్ ఆఫీసర్‌పై దాడి, నేరపూరిత చర్యలో తుపాకీ వాడకం తదితర తీవ్రమైన అభియోగాలు మోపనున్నట్లు స్పష్టం చేశారు.

గత దాడుల నేపథ్యంలో ఆందోళన

2024లో పెన్సిల్వేనియా, ఫ్లోరిడాలో ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటనల తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, తాజా ఘటన మళ్లీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా ఇదే వాషింగ్టన్ హిక్టన్ హోటల్ బయట హత్యాయత్నం జరిగింది.

Advertisement
Advertisement