త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MrBeast 500 Million Subscribers | యూట్యూబ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్.. 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో ‘మిస్టర్ బీస్ట్’ సంచలనం!

యూట్యూబ్ హిస్టరీలో మిస్టర్ బీస్ట్ సరికొత్త చరిత్ర లిఖించాడు. 50 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి యూట్యూబర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఆ ఇన్‌స్పైరింగ్ జర్నీ తెలుసుకుందాం రండి.

J

International | Published On Jun 13, 2026, 6.57 pm IST

MrBeast 500 Million Subscribers | యూట్యూబ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్.. 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో ‘మిస్టర్ బీస్ట్’ సంచలనం!

సంక్షిప్త సారాంశం

యూట్యూబ్‌లో 50 కోట్ల (500 మిలియన్) సబ్‌స్క్రైబర్ల మార్క్‌ను దాటిన తొలి ఇండివిడ్యువల్ క్రియేటర్‌గా మిస్టర్ బీస్ట్ (MrBeast) వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. జూన్ 12, 2026న తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ అభిమానుల సమక్షంలో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 2012లో 13 ఏళ్ల వయసులో యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టిన మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్. అతడి నికర ఆస్తి విలువ దాదాపు $2.6 బిలియన్లు. భారీగా క్యాష్ గివ్‌అవేలు, 'స్క్విడ్ గేమ్' లాంటి ఛాలెంజ్ వీడియోలతో పాటు 'బీస్ట్ ఫిలాంత్రపీ' ద్వారా విద్యా, మంచినీటి సదుపాయాలు కల్పిస్తూ ఎంతోమందికి సాయం చేస్తున్నాడు.

Advertisement

MrBeast 500 Million Subscribers | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబర్‌గా పేరుతెచ్చుకున్న 'మిస్టర్ బీస్ట్' (MrBeast) డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ 'యూట్యూబ్'లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్ల) సబ్‌స్క్రైబర్లను సాధించిన మొట్టమొదటి ఇండివిడ్యువల్ క్రియేటర్‌గా (Individual Creator) గ్లోబల్ రికార్డ్ సృష్టించాడు. జూన్ 12, 2026న తన ఛానెల్‌లో నిర్వహించిన లైవ్ స్ట్రీమ్‌లో కోట్లాది మంది అభిమానుల సాక్షిగా అతడు ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

ఒకప్పుడు యూట్యూబ్‌లో ప్యూడీపై (PewDiePie), టీ-సిరీస్ (T-Series) మధ్య సబ్‌స్క్రైబర్ల రేసు నడిచేది. కానీ, ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయాయి. మిస్టర్ బీస్ట్ దరిదాపుల్లో కూడా మరే ఇతర క్రియేటర్ లేనంత భారీ మార్జిన్‌తో అతడు నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు.

MrBeast Makes History First YouTuber to Hit 500 Million Subscribers

లైవ్ స్ట్రీమ్‌లో ఫ్యాన్స్ పండగ

50 కోట్ల సబ్‌స్క్రైబర్ల టార్గెట్‌కు చేరువవుతున్న సమయంలో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. నంబర్ ఎప్పుడెప్పుడు మారుతుందా అని ఫ్యాన్స్ లైవ్ కౌంట్‌ను ఫాలో అయ్యారు. చివరి 1,00,000 సబ్‌స్క్రైబర్లు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే యాడ్ కావడం విశేషం. ఆ క్షణంలో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌పై కనీవినీ ఎరుగని రికార్డ్ నమోదైంది.

13 ఏళ్ల వయసులో మొదలై.. 2.6 బిలియన్ డాలర్లకు!

మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ స్టీఫెన్ "జిమ్మీ" డొనాల్డ్‌సన్. మే 7, 1998లో పుట్టిన అతడు.. 2012లో తన 13 ఏళ్ల వయసులో మొదటిసారి వీడియోలు అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. 2017లో లక్ష వరకు నంబర్లు లెక్కపెడుతూ (counting to 100,000) చేసిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం అతడి నికర ఆస్తి (Net Worth) విలువ ఏకంగా 2.6 బిలియన్ డాలర్లు (రూ.21 వేల కోట్లకు పైనే) ఉన్నట్లు అంచనా.

ఆ కంటెంట్‌కే కోట్ల వ్యూస్

మిస్టర్ బీస్ట్ వీడియోలు చాలా వినూత్నంగా, హై-బడ్జెట్‌తో ఉంటాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే సర్వైవల్ స్టంట్స్ (Survival stunts), కోట్ల రూపాయల క్యాష్ గివ్‌అవేలు అతడి స్పెషాలిటీ.

రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'ను రియల్ లైఫ్‌లో సెట్ వేసి అతడు చేసిన వీడియోకు దాదాపు 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ వచ్చాయి.

సర్వైవల్ ఛాలెంజెస్: మంచుతో గడ్డకట్టుకుపోయే ఆర్కిటిక్‌లో 7 రోజులు చిక్కుకుపోవడం (7 Days Stranded in The Arctic) లాంటి ఎక్స్‌ట్రీమ్ ఛాలెంజ్‌లు ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి.

MrBeast Makes History First YouTuber to Hit 500 Million Subscribers

ఇంటర్నెట్‌లోని బడా స్ట్రీమర్స్‌ను ఒకచోట చేర్చి '50 స్ట్రీమర్స్ ఫైట్ ఫర్ $1,000,000' లాంటి క్రేజీ ప్రాజెక్టులతో వ్యూయర్స్‌ను కట్టిపడేశాడు.

బిజినెస్ ఎక్స్‌పాన్షన్.. రియల్ లైఫ్ హీరో కూడా!

ఒక యూట్యూబర్‌గానే కాకుండా బిజినెస్‌మ్యాన్‌గా, మంచి మనసున్న మనిషిగా జిమ్మీ తన బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేశాడు.

బీస్ట్ ఫిలాంత్రపీ (Beast Philanthropy): ఈ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వందశాతం సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్రామాలకు మంచినీటి బావులు, పిల్లల కోసం పదికి పైగా స్కూళ్లు నిర్మించాడు.

ఫీస్టబుల్స్ & లంచ్లీ (Feastables & Lunchly): ఫీస్టబుల్స్ పేరుతో ప్రారంభించిన చాక్లెట్ బార్స్ భారీ సక్సెస్ సాధించాయి. తోటి క్రియేటర్లు లోగన్ పాల్, KSI తో కలిసి 'లంచ్లీ' అనే ప్రీ-ప్యాకేజ్డ్ లంచ్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేశాడు.

వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బీస్ట్ గేమ్స్' (Beast Games) అనే మల్టీ-మిలియన్ డాలర్ రియాలిటీ గేమ్‌ షోకి సిద్ధమయ్యాడు.

యూట్యూబ్ చరిత్రలో ఒక ఇండివిడ్యువల్ క్రియేటర్ ఈ స్థాయిలో ఎదగడం, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండటం యువతకు ఎంతో స్ఫూర్తినిస్తోంది.

Advertisement
Advertisement