Boat Capsizes | మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 53 మంది మృతి
Boat Capsizes | లిబియా (Libya)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది (Migrant boat capsizes).
International | Published On Feb 10, 2026, 11.36 am IST
Boat Capsizes | లిబియా (Libya)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది (Migrant boat capsizes). మధ్యధరా సముద్రంలో (Mediterranean Sea) జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు శిశువులు సహా 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ విభాగం (UN migration agency) తెలిపింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి లిబియాలోని జావియా నగరం నుంచి అక్రమ వలసదారులతో ఈ పడవ బయల్దేరింది. అయితే, ఆరు గంటలు ప్రయాణించిన తర్వాత మధ్యధరా సముద్రంలో పడవ బోల్తాపడింది. ఆ సమయంలో అందులో 55 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి ఇద్దరు నైజీరియన్ మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 53 మంది ప్రాణాలు కోల్పోయారు.
మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. మెరుగైన జీవితం కోసం చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళ్లేందుకు ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా వేల మంది యూరప్ కంట్రీస్‌కు వలసపోతున్నారు. నియంత గఢాఫీ మరణాంతరం లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ భూభాగంపై ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవటంతో యూరప్‌కు చేరుకోవాలనుకుంటున్న వారంతా లిబియా తీరం నుంచే బయల్దేరుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఇక ఈ ఏడాది లిబియా నుంచి మధ్యధరా సముద్రం దాటేందుకు ప్రయత్నిస్తూ దాదాపు 500 మంది వసలదారులు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






