Libya | లిబియా నియంత గడాఫీ కుమారుడు దారుణ హత్య
Libya | లిబియా (Libya) మాజీ నియంత దివంగత మువామర్ గడాఫీ (Moammar Gaddafi) కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (Saif al-Islam Gaddafi) (53) దారుణ హత్యకు గురయ్యారు.
International | Published On Feb 4, 2026, 10.20 am IST
Libya | లిబియా (Libya) మాజీ నియంత దివంగత మువామర్ గడాఫీ (Moammar Gaddafi) కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (Saif al-Islam Gaddafi) (53) దారుణ హత్యకు గురయ్యారు. జింటాన్ (Zintan) నగరంలోని ఆయన ఇంట్లోకి చొరబడిన సాయుధులు ఇస్లాంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు గడాఫీ ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు సయిఫ్ సలహాదారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితమే తన భద్రతపై సయిఫ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ముమ్మార్ గడాఫీ రెండో కుమారుడైన అల్ ఇస్లాం గడాఫీ లండన్‌స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. లిబియాను 40 ఏళ్లకు పైగా నియంత మాదిరిగా పాలించిన మువామర్ గడాఫీ, 2011లో నాటో మద్దతుగల ప్రజాతిరుగుబాటులో పదవి కోల్పోయాడు. అదే ఏడాది అంతర్యుద్ధంలో హత్యకు గురయ్యాడు. ఇక తండ్రి మరణం అనంతరం లిబియా రాజకీయాల్లో సయిఫ్ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2021లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, కొన్ని కారణాలతో ఆ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




